వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్.. దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై ప్రకటన.. బ్యాంకులు పనిచేస్తాయి కానీ..

|
Google Oneindia TeluguNews

రెండు రోజుల వ్యవధిలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వందల్లో పెరగడంతో కేంద్ర సర్కారు అప్రమత్తమైంది. తర్జనభర్జనలు, హైలెవల్ మీటింగ్స్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఒక్కరోజు 'జనతా కర్ఫ్యూ' పాటించాలని పిలుపునిచ్చారు. కానీ కొత్త కేసుల సంఖ్య పెరుగూతూనే ఉంది. ఆదివారం సాయంత్రానికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 360కి పెరిగింది. దీంతో స్వచ్ఛంద కర్ఫ్యూను మరికొంత కాలం పొడిగించే దిశగా కేంద్రం అడుగులు వేసింది. కానీ ప్రధాని మోదీ.. ఆ మాస్టర్ ప్లాన్ ను రాష్ట్రల ప్రభుత్వాల ద్వారానే అమలు చేయించే ఎత్తుడను అనుసరించారు.

Recommended Video

Janata Curfew : Several States Announced Lockdown By Central's Decision
కథ ముగియలేదు..

కథ ముగియలేదు..


ఆదివారం రాత్రి 9 గంటలతో ప్రధాని మోదీ పిలుపునిచ్చిన 14 గంటల ‘జనతా కర్ఫ్యూ' గడువు ముగిసినట్లయింది. అయితే, గడువు ముగిసినంత మాత్రాన సంబురాలు జరుపుకోవద్దని, మరికొంత కాలంపాటు జనం ఇళ్లకే పరిమితం కావాలని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన కొరారు. దేశవ్యాప్తంగా మొత్తం 75 జిల్లాల్లో లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. దానికి అదనంగా మొత్తం 13 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పూర్తి లాక్ డౌన్ ప్రకటించడం గమనార్హం. వాటిలో..

లాక్ డౌన్ ప్రకటించిన రాష్ట్రాలివే..

లాక్ డౌన్ ప్రకటించిన రాష్ట్రాలివే..


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, పంజాబ్, నాగాలాండ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలతోపాటు ఢిల్లీ కూడా ఉంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. లాక్ డౌన్ ప్రకటించిన 12 రాష్ట్రాల్లో వచ్చే తొమ్మిది రోజులపాటు అంటే, మార్చి 31 వరకు ‘జనతా కర్ఫ్యూ' లాంటి పరిస్థితే కొనసాగనుంది. కాకుంటే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ప్రజల్ని అనవసరంగా రోడ్ల పైకి రానీయకుండా ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇక పాలు, బ్యాంకు సేవల విషయానికొస్తే..

బ్యాంకులు పనిచేస్తాయి కానీ..

బ్యాంకులు పనిచేస్తాయి కానీ..


దేశవ్యాప్త లాక్ డౌన్ విషయంలో కేంద్రం, రాష్ట్రాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. 75 జిల్లాల్లో లాక్ డౌన్ కు సంబంధించి కేంద్రం జారీచేసిన ఆదేశాల్లో బ్యాంకులు పనిచేస్తాయని పేర్కొనడం గమనార్హం. లాక్ డౌన్ ప్రకటించిన 12 రాష్ట్రాల్లోనూ బ్యాంకులు పరిమితంగా పనిచేసే అవకాశముంది. పాలు, ఇతర నిత్యావసరాల కొనుగోళ్లకు వీలుగా స్థానిక కిరాణా దుకాణాలను అనుమతించిన సమయంలో తెరిచి ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసుల పర్యవేక్షణలో.. జనం గుమ్మి కూడకుండా.. ఇంటికి ఒక్కరు మాత్రమే దుకాణానికి వెళ్లేందుకు అనుమతిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే మోడల్ అమలయ్యే అవకాశాలున్నాయి.

వ్యవస్థలన్నీ పరిమితంగానే..

వ్యవస్థలన్నీ పరిమితంగానే..


కరోనా వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం నిరవధికంగా వాయిదా పడతాయి. సుప్రీంకోర్టులో నేరుగా కాకుండా, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా మాత్రమే కేసుల్ని విచారిస్తారు. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో కేవలం అత్యవసర విభాగాల వాళ్లు మాత్రమే విధులకు హాజరుకావాల్సి ఉంటుందని సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఢిల్లీ, కోల్ కతా సహా ఇతర ఎయిర్ పోర్టుల్లో అంతర్జాతీయ సర్వీసుల్ని బంద్ చేశామని, కేవలం డొమెస్టిక్ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయని డీజీసీఏ తెలిపింది. ముంబైలోని స్టాక్ ఎక్సేంజ్ సోమవారం యధావిధిగా నడుస్తుందని సీఈవో చౌహాన్ తెలిపారు.

English summary
As janata Curfew ends by sunday 9pm, modi urged people to remain in houses. 13 States Go Beyond 80-District Lockdown Call of Centre, Announce Total Lockdowns
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X