లేడీ కోచ్‌కు లైంగిక వేధింపులు: కేసు నమోదు, మంత్రి పదవి నుంచి వైదొలిగిన సందీప్

ఛండీగఢ్: హర్యానా క్రీడల శాఖ మంత్రి సందీప్ సింగ్‌పై లైంగిక ఆరోపణల కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడని జూనియర్ మహిళా అథ్లెట్ కోచ్ ఇటీవల ఆరోపణలు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రీడల మంత్రిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో తాను తన మంత్రి పదవీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు సందీప్ సింగ్ ప్రకటించారు. తన ప్రతిష్టతను దెబ్బతీసేందుకే కొందరు చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. వీటిపై లోతుగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే తాను మంత్రి పదవి నుంచి వైదొలిగినట్లు చెప్పారు.

Sexual Harassment on woman coach: Haryana Sports Minister Quits

తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన కొన్ని గంటల తర్వాత, దర్యాప్తు నివేదిక వెలువడే వరకు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు క్రీడా శాఖ బాధ్యతలు అప్పగించినట్లు సందీప్ సింగ్ ఆదివారం తెలిపారు.

తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కోచ్‌పై మంత్రి ఫిర్యాదు చేయడంతో హర్యానా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శనివారం ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

ఆయన తన పోర్ట్‌ఫోలియోను వదులుకున్నారా లేదా మంత్రిత్వ శాఖకు రాజీనామా చేశారా అనే దానిపై వెంటనే స్పష్టత రాలేదు. పరిస్థితిపై స్వతంత్ర దర్యాప్తునకు గతంలో పిలుపునిచ్చిన మంత్రి.. కోచ్ ఆరోపణలను నిరాధారమైనవిగా కొట్టిపారేశారు.

'సందీప్ సింగ్ నన్ను శారీరకంగా, మానసికంగా వేధించాడు. మొదట, నేను అతనిని తప్పించడానికి ప్రయత్నించాను, కానీ అతను నన్ను వేధిస్తూనే ఉన్నాడు. చర్య తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను' అని బాధిత కోచ్ తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు రాష్ట్ర మంత్రిపై చండీగఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన ఆరోపణలు సోషల్, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వ్యాపిస్తున్నాయని, ఈ విషయంపై కమిటీ తక్షణమే లోతైన విచారణ జరిపి, దాని ఫలితాలను వీలైనంత త్వరగా ఈ (డీజీపీ) కార్యాలయానికి సమర్పించాలని హోంమంత్రి ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+