నారా లోకేష్ పుట్టినరోజున జూనియర్ ఎన్టీఆర్ అనూహ్య పోస్ట్.. ఫ్యాన్స్ రచ్చ!

ఏపీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ అయిన నారా లోకేష్ పుట్టిన రోజు నేడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి, 2024 ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రజాసేవలో తనదైన మార్కు చూపిస్తూ తన నియోజకవర్గం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు చాలా కష్టపడుతున్నారు.

లోకేష్ పుట్టినరోజు.. జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర ట్వీట్
లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే పార్టీ శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక చాలాకాలంగా తెలుగుదేశం పార్టీ పైన, టిడిపిలో జరుగుతున్న అనేక పరిణామాల పైన ఏ విషయంలోనూ నోరు విప్పని జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర పోస్ట్ చేశారు. నారా లోకేష్ మీకు ఈ ఏడాది మరొక అద్భుతమైన సంవత్సరం అవ్వాలని కోరుకుంటున్నానని, జన్మదిన శుభాకాంక్షలు అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

Junior NTR interesting post about Nara Lokesh sparks discussion among fans

సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ
ఇక జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ పైన ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, నారా లోకేష్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర చర్చ చేస్తున్నారు. 2009 ఎన్నికల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ పక్కన పెట్టింది అన్న ప్రచారం ఉండగా, అప్పటినుండి ఇప్పటివరకు లోకేష్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నారా లోకేష్ కోసమే, జూనియర్ ఎన్టీఆర్ ను పెడుతున్నారు అన్న చర్చ జరుగుతోంది.

లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ కలిస్తే టీడీపీకి తిరుగే ఉండదని చర్చ
కొందరు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో తిరిగి యాక్టివ్ కావాలని, మరికొందరు లోకేష్ పార్టీ పగ్గాలు చేపట్టాలని ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఆసక్తికర పరిణామంగా మారింది. వీరిద్దరూ కలిస్తే తెలుగుదేశం పార్టీకి తిరుగుండదు అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ లోకేష్ ను ఉద్దేశించి ట్వీట్
ఇదిలా ఉంటే లోకేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో భావి తరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడంలో లోకేష్ పాత్రను కొనియాడారు.

లోకేష్ ముందడుగుపై పవన్ కళ్యాణ్
ఉపాధ్యాయులకు, పేరెంట్స్ మధ్య సుహృద్భావ వాతావరణం కల్పిస్తూ, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో లోకేష్ ముందడుగు వేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తూ, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. ప్రజలకు సేవ చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళేందుకు మరింత శక్తిని, సుఖసంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.

లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ షర్మిల
కాగా రాజకీయాలను పక్కనపెట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ భగవంతుడు లోకేష్కు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నానని షర్మిల తన పోస్టులో పేర్కొన్నారు. ఇక రాజకీయంగా లోకేష్ ను , చంద్రబాబును సర్కార్ ను టార్గెట్ చేసినా పుట్టినరోజు నాడు ఆయన క్షేమాన్ని కోరుతూ పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+