ఉల్లి, టమాటా లేకుండానే 'చికెన్ కర్రీ'.. ఇలా సింపుల్ గా చేసుకోండి..!
చికెన్ అంటే అందరూ ఇష్టపడతారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా చికెన్ ను అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. చికెన్ ను ఫ్రై చేసుకున్నా.. గ్రేవీ పెట్టుకున్నా.. ఇలా రకరకాలుగా చేస్తే టేస్టీగా ఉంటుంది. అయితే చికెన్ కర్రీని ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈసారి వెరైటీగా ట్రై చేయాలనుకుంటున్నారా..? అయితే ఉల్లి, టమాటా లేకుండానే 'చికెన్ కర్రీ' తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూస్తే..
'చికెన్ కర్రీ' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. చికెన్ అరకిలో, పెరుగు పావుకప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు ఒక చెంచా, కారం ఒక టేబుల్ స్పూన్, పసుపు అరచెంచా, ధనియాలపొడి అరచెంచా, జీలకర్రపొడి అరచెంచా, గరంమసాలా అరచెంచా, నూనె పావుకప్పు, వెల్లుల్లి రెబ్బలు ఏడెనిమిది, ఎండుమిర్చి ఏడు లేదా ఎనిమిది, సన్నని కొత్తిమీర తరుగు రెండు టేబుల్ స్పూన్ లు, ఉప్పు రుచికి సరిపడా, నిమ్మకాయ ఒకటి తీసుకోవాలి.
చికెన్ కర్రీ తయారీ కోసం ముందుగా ఒక గిన్నెలో చికెన్ తీసుకుని శుభ్రంగా కడగాలి. తర్వాత అందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరంమసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, నిమ్మరసం వేసుకోవాలి. ఇవన్నీ చికెన్ ముక్కలకు మంచిగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అరగంట పాటు ఫ్రిడ్జ్ లో ఉంచాలి.
ఈలోపు వెల్లుల్లి మసాలాను సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి మెత్తని పేస్ట్ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర తరుగును పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో చికెన్ మిశ్రమాన్ని వేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి.

ఇప్పుడు చికెన్ ను ఉడికే వరకూ కుకింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో వెల్లుల్లి మసాలా వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. నీళ్లు పోసి మధ్యమధ్యలో కలుపుతూ కర్రీ దగ్గరకు అయ్యేంత ఉడికించుకోవాలి. చివరిలో కొత్తిమీర తరుగు వేస్తే సరి..












Click it and Unblock the Notifications