పరమశివుడి ప్రతిరూపంపై కాళ్లు పెట్టి: స్వామిజీ నిర్వాకంపై భక్తుల ఆగ్రహం..

Subscribe to Oneindia Telugu

బెంగళూరు: రాసలీలల వ్యవహారాలతో కొంతమంది స్వామిజీలు వార్తల్లోకి ఎక్కుతుంటే.. మరికొంతమంది వివాదాస్పద పూజలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా ఓ స్వామిజీ ఏకంగా శివలింగంపై కాళ్లు పెట్టి పూజలు చేస్తున్న ఫోటోలు లీక్ అవడం తీవ్ర వివాదాస్పదమవుతోంది.

పరమశివుడికి ప్రతిరూపంగా భావించే శివలింగంపై స్వామిజీ కాళ్లు పెట్టడమేంటి? అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. బెంగళూరు నగర శివారులోని నెలమంగల సమీపంలోని కెరెకత్తిగనూరు గ్రామంలో ఉన్న శైవమఠంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.

shantilingeswara swawmiji legs on shiva lingam

స్వామిజీ వ్యవహారంపై పలు శైవ మఠాలకు చెందిన ఇతర స్వామిజీలు, భక్తులు మండిపడుతున్నారు. శివలింగంపై కాళ్లు పెట్టడాన్ని వారు తీవ్రంగా భావిస్తున్నారు. మరోవైపు ఆ పూజలు నిర్వహించిన శాంతిలింగేశ్వర స్వామిజీ మాత్రం తమ ఆచారాలకు అనుగుణంగానే పూజలు నిర్వహిస్తున్నామంటూ చెప్పడం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A controversial Swamiji held pooja By Keeping his Legs On Shiva Lingam in Bangalore

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి