"అజిత్ పవార్ మృతి ప్రమాదం మాత్రమే.. కుట్ర లేదు"
మహారాష్ట్రలోని బారామతి వద్ద జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ఆకస్మిక మరణంపై ఎన్‌సీపీ- ఎస్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ స్పందించారు. విమాన ప్రమాదంలో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని తెలిపారు. ఇది కేవలం యాక్సిడెంట్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ మేరకు శరద్ పవార్ భావోద్వేగానికి గురయ్యారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, తన మేనల్లుడు అజిత్ పవార్ మరణంపై ఎన్‌సీపీ-ఎస్‌సీపీ అధినేత శరద్ పవార్ తొలిసారి స్పందించారు. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణంపై ఎటువంటి రాజకీయ కుట్ర లేదని స్పష్టం చేశారు. ఈ ఘటన కేవలం ప్రమాదం తప్ప రాజకీయ కుట్ర కాదని ఆయన తేల్చి చెప్పారు.
శరద్ పవార్ ఈ విషయమై మాట్లాడుతూ, "ఇది ప్రమాదం, ఇందులో రాజకీయం లేదు" అని తెలిపారు. "కొందరు ఈ సంఘటనకు రాజకీయ రంగును పూసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. ఇది పూర్తిగా ఒక ప్రమాదం. ఈ ఘటన నాతో పాటు మొత్తం రాష్ట్రంలోని ప్రజానీకానికి తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. ఈ ఘటనను రాజకీయం చేయవద్దని అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. దేశంలోని రాజకీయ నాయకుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. "రాజకీయ నాయకులకు కూడా భద్రత లేదు. ప్రతిపక్ష నాయకుల భవిష్యత్తు ఏంటో మాకు తెలియదు" అని ఆమె వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ బీజేపీ నేతృత్వంలోని కూటమి నుండి వైదొలగాలని ఆలోచిస్తున్నారని సోషల్ మీడియా నివేదికలు ఉన్నాయంటూ ఆమె ఇటీవల రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు. ఈ విమాన ప్రమాదం "తీవ్ర దురదృష్టకరం" అని అభివర్ణిస్తూ, ఈ ఘటనపై విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇక బారామతి విమానాశ్రయం సమీపంలో కూలిన విమానంలో అజిత్ పవార్‌ తో పాటు మరో నలుగురు వ్యక్తులు మరణించారు. పూణే జిల్లాలో ఫిబ్రవరి 5న జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగు ర్యాలీల్లో పాల్గొనడానికి పవార్ ఉదయం ముంబై నుండి బయలుదేరారు. రన్‌వే థ్రెషోల్డ్ సమీపంలో విమానం కూలినప్పుడు, అందులోని ఐదుగురు వ్యక్తులు (అజిత్ పవార్ తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, ఒక విమాన సహాయకురాలు, ఇద్దరు పైలట్లు) మరణించారు.

అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం ఉదయం 11 గంటలకు విద్యా ప్రతిష్ఠాన్ మైదాన్‌ లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఆయన మృతికి నివాళిగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సెలవు దినంతోపాటు పాటు మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు. ఈ మూడు రోజుల సంతాప కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి ఎగురవేస్తారు. ఈ సమయంలో ఎలాంటి ప్రభుత్వ వినోద కార్యక్రమాలను నిర్వహించరు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications