వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సునంద కేసు: చూస్తున్నానని థరూర్, స్వామి ఆరోపణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తన భార్య సునంద పుష్కర్ మృతి కేసు దర్యాఫ్తు పైన ఢిల్లీ పోలీసులను మొదట్లోనే తాను నివేదికను అడిగానని, దీని పైన వారి నుండి ఇంకా సమాధానం రాలేదని మాజీ కేంద్రమంత్రి, తిరునంతపురం పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ శనివారం చెప్పారు. నివేదిక కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు.

తన తల్లి మరణం పైన దర్యాఫ్తును త్వరితగతిన పూర్తి చేయాలని సునంద పుష్కర్ తనయుడు శివ్ పుష్కర్ మీనన్ పోలీసులను కోరాడు. సునంద పుష్కర్ మృతి కేసులో తీసుకున్న చర్యల పైన నివేదిక సమర్పించాలని పోలీసులకు జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.

Shashi Tharoor keeps silent on AIIMS report

సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు

సునంద పుష్కర్ మృతికి ముందు రోజు శశిథరూర్ తన భార్య పట్ల వయోలెంట్‌గా ప్రవర్తించాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి శనివారం ఆరోపించారు. కుంభకోణాలలో ఉన్న వారి పేర్లు బయటపెడతానని సునంద భర్తను హెచ్చరించిందని ఆయన అన్నారు.

సునంద ఆస్తులు తీసుకోలేదు: శశిథరూర్

సునంద పుష్కర్ మృతి అనంతరం ఆమెకు చెందిన ఆస్తులను తాను ఏవీ తీసుకోలేదని శశిథరూర్ కేరళ హైకోర్టుకు చెప్పారు. శశిథరూర్ తరఫు న్యాయవాది హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. సునంద పుష్కర్ కెనెడియన్ సిటిజన్ అని, కెనెడియన్ చట్టాల ప్రకారం.. భార్య ఆస్తులు భర్తకు వారసత్వంగా రావని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో శశిథరూర్ సునంద ఆస్తులను ప్రకటించలేదని పిటిషన్ దాఖలైంది. దాని పైన పైవిధంగా శశిథరూర్ స్పందించారు.

English summary

 A day after fresh reports emerged from the All India Institute of Medical Sciences, concluding that the former Union HRD minister Shashi Tharoor’s wife Sunanda Pushkar died of poisoning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X