యాకుబ్ మెమన్ ఉరి బాధ కలిగించింది: శశిథరూర్
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ మరణశిక్ష తనను బాధించిందని కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ అన్నారు. మెమన్‌కు మరణశిక్ష అమలు చేయడంపై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన గురువారం ఉదయం సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను వెల్లడించారు.
మెమన్ ఉరితీత తనకు బాధ కలిగించిందని ట్వీట్ చేశారు. 'మన ప్రభుత్వం ఒక మనిషిని ఉరి తీసిందనే వార్త తనను చాలా బాధపెట్టింది. మరణదండన వల్ల ప్రతికూల ఫలితాలే తప్ప సానుకూల ఫలితాలు వచ్చిన దాఖలాలేమీ లేవు' అని ట్విట్ చేశారు.

క్రూరమైన ఉరితీతలు ఉగ్రవాదాన్ని నిలువరించలేకపోయాయని శశిథరూర్ వ్యాఖ్యానించారు. కక్షసాధింపు చర్య, ప్రతీకార హత్య తప్ప మరొకటి కాదన్నారు. ఇది ప్రభుత్వ వైఫ్యలమనీ, ప్రభుత్వం చేసిన హత్య అంటూ బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఇది ఇలా ఉండగా, శశిథరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. థరూర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పేర్కొంది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో నాగపూర్ జైల్లో గురువారం ఉదయం యాకూబ్ మెమన్‌ను ఉరితీసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications