ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షీలా దీక్షిత్, ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్

న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను గురువారం ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమించారు. అనారోగ్యం కారణంగా అజయ్ మాకెన్ బుధవారం ఈ పదవికి రాజీనామా చేశారు. దీంతో షీలా దీక్షిత్‌కు బాధ్యతలు అప్పగించారు.

ఢిల్లీ యూనిట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఇంచార్జ్ పీసీ చాకో మాట్లాడుతూ.. షీలా దీక్షిత్‌ను అధ్యక్షురాలిగా నియమించామని, అమెకు సహకరించేందుకు ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్‌ను నియమిస్తామని చెప్పారు. దేవేందర్ యాదవ్, హరూన్ యూసుఫ్, రాజేష్ లిలోటియా నియమిస్తామన్నారు.

Sheila Dikshit new president of Delhi Congress, to be assisted by three working presidents

అలాగే, ఢిల్లీలో ఆమ్ అద్మీ పార్టీతో పొత్తులపై ఇప్పటి వరకు చర్చలు జరపలేదని చెప్పారు. 2019 పార్లమెంటరీ ఎన్నికల కోసం పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. కాగా, షీలా దీక్షిత్‌ను పార్టీ అధ్యక్షురాలుగా నియమించిన నేపథ్యంలో ఆమెకు మాజీ అధ్యక్షులు అజయ్ మాకెన్ శుభాకాంక్షలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+