
శిల్పా శెట్టి: పోర్న్ కాదు... నా భర్త శృంగార దృశ్యాలు మాత్రమే తీస్తారు - ప్రెస్ రివ్యూ
ఓటీటీలో పోర్న్ సినిమాలు ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలపై అరెస్టైన తన భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి అండగా నిలిచారని సాక్షి తెలిపింది.
''తన భర్త చాలా అమాయకుడని, శృంగారభరితమైన సినిమాలు తీస్తారే తప్ప పోర్న్ (అశ్లీల / నీలి చిత్రాలు) తీయరని ముంబయి పోలీసుల ఎదుట శిల్పా శెట్టి వెల్లడించారు. ఈ రెండింటికి చాలా తేడా ఉందని శిల్ప తన వాంగ్మూలంలో వివరించారు.
శుక్రవారం రాత్రి దాటేదాకా ఈ కేసులో ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసు బృందం శిల్పను దాదాపుగా ఆరు గంటల సేపు ప్రశ్నించింది.
హాట్‌షాట్స్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో వచ్చేవన్నీ ఎక్కువగా కుంద్రా బావగారు ప్రదీప్ భక్షి తీస్తారని ఆమె విచారణలో వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. పోర్న్ సినిమాలకు, తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని శిల్ప చెప్పినట్టు తెలిపాయి.
హాట్‌షాట్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వచ్చే కంటెంట్‌పై తనకి ఎలాంటి అవగాహన లేదని, దాంట్లో తన ప్రమేయం ఏ మాత్రం లేదని వెల్లడించింది.
బిగ్ బ్రదర్ రియాల్టీ షోలో పాల్గొన్న అనంతరం శిల్ప ఒక బిజినెస్ డీల్ మాట్లాడడానికి వెళ్లినప్పుడు 2007లో లండన్‌లో కుంద్రాను కలుసుకున్నారు.
రెండేళ్లపాటు డేటింగ్ చేశాక 2009లో పెళ్లిచేసుకున్నారు. వారిద్దరూ ఐపీఎల్ రంగంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో పెట్టుబడి పెట్టారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకున్న కుంద్రాపై సుప్రీంకోర్టు కమిటీ జీవితకాల నిషేధం విధించింది. 2018లో బిట్ కాయిన్ వ్యాపారంలో అవకతవకలపై కూడా రాజ్‌పై ఈడీ విచారణ జరిపింది’’అని సాక్షి తెలిపింది.
హీరోయిన్ త్రిషకు త్వరలోనే పెళ్లి
నటి త్రిష త్వరలోనే ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోందని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.
''కోలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్‌తో త్రిష ప్రేమలో పడిందని.. త్వరలో వీళ్లిద్దరూ తమ బంధాన్ని వివాహబంధంగా మార్చుకోనున్నారని వార్తలు వస్తున్నాయి.
పెద్దలు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. అతి త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నట్లు సమాచారం.
ఆమె నటించిన ఓ చిత్రానికి అతనే డైరెక్టర్‌గా వ్యవహరించారని.. చిత్రీకరణ సమయంలోనే ప్రేమలో పడ్డారని వార్తలు వస్తున్నాయి. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె చేతిలో ఐదు కోలీవుడ్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వాటిల్లో 'పొన్నియిన్ సెల్వన్’ ఒకటి.
గతంలో త్రిషకి వ్యాపారవేత్త వరుణ్‌తో నిశ్చితార్థమైన విషయం తెలిసిందే. అయితే.. మనస్పర్థలు రావడంతో వారి బంధానికి మధ్యలోనే ది ఎండ్ కార్డ్ పడింది’’అని ఈనాడు తెలిపింది.
- నెల్లూరు: 'బాబు ప్రాణాలతో ఉంటే చాలు ఎప్పటికైనా చూస్తాం’
- అర్మేనియా-అజర్బైజాన్: యుద్ధమంతా డ్రోన్లతోనే

ఎంపీ మాలోత్ కవితకు 6 నెలల జైలు..వెంటనే బెయిల్
మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష పడిందని వెలుగు పత్రిక ఓ కథనం ప్రచురించింది.
''రూ.10వేల జరిమానాను కూడా ప్రజా ప్రతినిధుల కోర్టు విధించింది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బులు పంచారన్న కేసులో కోర్టు తీర్పునిచ్చింది.
2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో.. మాలోత్ కవిత ఓటర్లకు డబ్బు పంపిణీ చేసినట్లు బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి కేసులో శనివారం కోర్టు తీర్పునిచ్చింది.
అయితే ఈ కేసుకు సంబంధించి ఎంపీ కవిత రూ.10వేల జరిమానా చెల్లించగా.. ప్రజా ప్రతినిధుల కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది.
మాలోత్ కవిత తన రాజకీయ జీవితాన్ని 2009లో ప్రారంభించారు. మొదట కాంగ్రెస్‌లో ఉన్న ఆమె తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ఆమె మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు’’అని వెలుగు తెలిపింది.
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏంటి? వీటికి పరిష్కారాలు ఏంటి?
- ముంపులో 350 గ్రామాలు.. మూడు రాష్ట్రాల మధ్య ఆగిపోయిన రాకపోకలు

నకిలీ పెయిడ్ లీవ్స్‌తో రూ.10 కోట్లు అక్రమంగా సంపాదించిన ప్రభుత్వ ఉద్యోగి
ఒక ప్రభుత్వ ఉద్యోగి నకిలీ పెయిడ్ లీవ్స్‌తో ఏకంగా రూ.10 కోట్లు అక్రమంగా సంపాదించాడని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.
''గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని ప్రాథమిక విద్యాశాఖలో డిప్యూటీ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న రాజేష్ రామి భారీ మోసానికి పాల్పడ్డాడు.
అహ్మదాబాద్ జిల్లాలోని ఎనిమిది తాలూకాల్లోని ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్లలో పని చేసే ఉపాధ్యాయుల పేరుతో సుమారు 5000 నకిలీ పెయిడ్ లీవ్స్‌ను అప్లై చేశాడు.
ఆ పెయిడ్ లీవ్స్‌ను రూ.9.99 కోట్ల మేర నగదుగా మార్చుకుని తన, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు మళ్లించాడు.
2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మూడు తాలూకాలు సమర్పించిన డాక్యుమెంట్లను అధికారులు ఆడిట్ చేయగా ఈ విషయం బయటపడింది.
దీంతో సంబంధిత అధికారులు ఈ నెల 15న రాజేష్ రామి చీటింగ్‌పై కరంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ స్కామ్‌లో మరికొందరి ప్రమేయం ఉండి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. మరోవైపు నిందితుడు రాజేష్ రామి పరారీలో ఉన్నాడు’’అని నమస్తే తెలంగాణ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- మీరాబాయి చానూ: రియో ఒలింపిక్స్‌లో ఓటమి నుంచి టోక్యోలో విజయం వరకు
- టోక్యో ఒలింపిక్స్: ఘనంగా ప్రారంభమైన ప్రపంచ క్రీడా వేడుక
- తెలంగాణ: వనపర్తి ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు కారణమేంటి?
- కృష్ణా జల వివాదం: నీటి పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య ఎందుకీ వివాదం, దీనికి మూలం ఎక్కడ?
- ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం, మరి రుయా ఆస్పత్రిలో మరణాలెలా సంభవించాయి?
- మొన్న చైనాలో మంకీ బీ వైరస్, ఇప్పుడు అమెరికాలో మంకీపాక్స్ కలకలం
- తెలంగాణలో భారీ వర్షాలు: నిర్మల్‌లో రోడ్ల మీదే చేపల వేట
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)