అమిత్ షా ను 'గబ్బర్ సింగ్' చేసిన శివసేన..!
ముంబై : పేరుకే మిత్రపక్షాలు గానీ శివసేన-బీజేపీ మధ్య రోజు రోజుకి అగాథం మరింత పెరిగిపోతుంది. ముందునుంచి బీజేపీ పోకడలను వ్యతిరేకిస్తూ వస్తోన్న శివసేన తాజాగా మరోసారి బీజేపీని టార్గెట్ చేస్తూ ముంబైలో నిరసన చేపట్టింది.
కాగా, నిరసనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిని 'గబ్బర్ సింగ్' లా చిత్రీకరించిన పోస్టర్లతో ర్యాలీ నిర్వహించడం వివాదస్పదంగా మారింది. ఈ తాజా వివాదానికి కేంద్ర బిందువుగా మారిన అంశం 'మనోగత్' పత్రిక ద్వారా బీజేపీ నేత మాధవ్ బండారి శివసేనకు సవాల్ విసరడమే.
శివసేన లేవనెత్తుతున్న ఆరోపణలకు, విమర్శలకు బీజేపీ అధికార పత్రిక మనోగత్ ద్వారా గట్టి జవాబు ఇస్తూ వస్తోన్న మాధవ్ బండారి.. 'నిజంగా శివసేనకు దమ్ముంటే బీజేపీతో మిత్ర బంధాన్ని తెంచుకోవాలని' సవాల్ విసిరారు. అంతేకాదు.. విడాకులు ఎప్పుడు తీసుకోబోతున్నారంటూ..? పత్రిక ద్వారా శివసేనను ప్రశ్నించారు.

పత్రికలో మాధవి భండారి చేసిన ఈ వ్యాఖ్యలపై శివసేన భగ్గుమంది. దీనికి నిరసనగా నగర బీజేపీ యూనిట్ చీఫ్ షెల్లార్ దిష్టిబొమ్మను దగ్గం చేసిన శివసేన, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను గబ్బర్ సింగ్ అవతారంలో, మాధవ్ భండారిని శకుని మామ అవతారంలో చిత్రీకరించిన పోస్టర్లను ప్రదర్శించి నిరసన తెలిపింది.
ఇదిలా ఉంటే.. శివసేన వ్యవహారంపై రాష్ట్ర బీజేపీ కార్యదర్శి సుజిత్ సింగ్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. శివసేన తమ కార్యకర్తలను అదుపులో పెట్టుకోకపోతే తామే బుద్ది చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications