చివరకు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే శివసేన మద్దతు: అయితే, బీజేపీకి కాదట!
ముంబై: ఎట్టకేలకు ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. శివసేన కోర్ కమిటీ రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించిందని ఆ పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. అయితే తాము బీజేపీ మద్దతు ఇస్తున్నామని దీని అర్థం కాదని స్పష్టం చేశారు.
ముంబైలోని తన నివాసంలో ఉద్ధవ్ ఠాక్రే ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన పలువురు శివసేన ఎంపీలు రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని బీజేపీతో పొత్తుకు తెరతీయాలని కోరిన మరుసటి రోజు ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

మొత్తం 16 మంది ఎంపీలు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తమ మద్దతును తప్పక అందించాలని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ముకు మద్దతివ్వాలని శివసేన నిర్ణయించిందని, అయితే దీని అర్థం మేము బీజేపీకి మద్దతిస్తున్నామని కాదు'' అని సంజయ్ రౌత్ మంగళవారం అన్నారు.
రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరగనున్నాయి, రాష్ట్రపతి ఎన్నికలకు విప్ లేదు, ఎంపీలు తమ ఇష్టానుసారం ఓటు వేయవచ్చు. శివసేన ఎంపీ గజానన్ కీర్తికర్ మీడియాతో మాట్లాడుతూ.. 16 మంది ఎంపీలు "గిరిజన వర్గానికి చెందిన మహిళ" కాబట్టి ముర్ముకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
"ఆమె ఎన్డీఏ అభ్యర్థి, కానీ ద్రౌపది ముర్ము గిరిజన వర్గానికి చెందిన ఒక మహిళ. మేము ఆమెకు మా మద్దతు ఇవ్వాలి.. ఇది ఎంపీలందరి (పార్టీ) డిమాండ్. ఒకటి రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని చెబుతానని ఉద్ధవ్ జీ మాకు చెప్పారు'' అని కీర్తికర్ అన్నారు.
రాష్ట్రపతి ఎన్నికలపై జరిగిన కీలక సమావేశానికి సేనకు చెందిన మొత్తం 18 మంది లోక్‌సభ ఎంపీల్లో 16 మంది హాజరయ్యారు. ముర్ముకు మద్దతు ఇవ్వడానికి అందరూ అంగీకరించారని కిరీట్కర్ చెప్పారు. 18 మంది ఎంపీలలో ఇద్దరు ఎంపీలు భావనా గవాలీ, శ్రీకాంత్ షిండే గైర్హాజరయ్యారు.












Click it and Unblock the Notifications