వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు షాక్; రైతులపై మారణకాండ జరిగిన యూపీ లఖింపూర్ ఖేరిలోనూ బీజేపీ లీడ్

|
Google Oneindia TeluguNews

ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. నేతల భవితవ్యం తేలే ఈ రోజున అందరిలోనూ టెన్షన్ నెలకొంది. ఇదిలాఉంటే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్, బహుజన సమాజ్ పార్టీ మాయావతి విస్తృతంగా ప్రచారం చేసినా, కాంగ్రెస్ పార్టీ ఉత్తర ప్రదేశ్ లో బిజెపికి చెక్ పెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేసినా ప్రజలు మరోమారు బీజేపీకే పట్టం కట్టారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ దుమ్ము రేపుతూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటి దూసుకుపోతున్న బీజేపీ ఉత్తరప్రదేశ్ ప్రజలు యోగి సర్కార్ వైపే నిలిచారని సంతోషం వ్యక్తం చేస్తోంది.

 లఖింపూర్ ఖేరిలో షాకింగ్ రిజల్ట్స్ .. బీజేపీ ముందంజ

లఖింపూర్ ఖేరిలో షాకింగ్ రిజల్ట్స్ .. బీజేపీ ముందంజ


ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ఆసక్తికరంగా లఖింపూర్ ఖేరిలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. లఖింపూర్ కేరి లో రైతులు మీదుగా వాహనం నడిపి మారణకాండ సృష్టించిన, రైతుల మరణాలకు కారణమైన ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అదే మించిన తనయుడు ఆశిష్ మిశ్రా ఈ ఘటనకు బాధ్యుడని రైతులు ఆరోపించారు. ప్రతి పక్షాలు సైతం బిజెపిని టార్గెట్ చేస్తూ ఈ ఘటనను రైతు వ్యతిరేక ప్రభుత్వానికి నిదర్శనంగా చూపించాయి. ఇక అటువంటి లఖింపూర్ ఖేరిలో బిజెపి ముందంజలో ఉండటం ఆసక్తికర పరిణామంగా మారింది.

లఖింపూర్ ఖేరి జిల్లాలోని ఎనిమిది స్థానాల్లో 7చోట్ల బీజేపీ దూకుడు

లఖింపూర్ ఖేరి జిల్లాలోని ఎనిమిది స్థానాల్లో 7చోట్ల బీజేపీ దూకుడు

లఖింపూర్ ఖేరీలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన బీజేపీపై వ్యతిరేకతను తీసుకువస్తుందని అందరూ భావించిన వేళ, ఊహించని విధంగా లఖింపూర్ ఖేరి జిల్లాలోని ఎనిమిది స్థానాల్లో బిజెపి ఏడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిగిలిన వాటిలో సమాజ్‌వాదీ పార్టీ ముందంజలో ఉంది. రైతులకు సంబంధించిన సంఘటన జరిగిన టికునియాలోని నిఘసన్‌లో బీజేపీకి చెందిన శశాంక్ వర్మ 39,975 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఎస్పీకి చెందిన ఆర్ఎస్ కుష్వాహా 24,527 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

ప్రత్యర్ధి పార్టీలకు ఊహించని పరిణామం

ప్రత్యర్ధి పార్టీలకు ఊహించని పరిణామం

పొరుగున ఉన్న పాలియాలో బీజేపీకి చెందిన హర్విందర్ కుమార్ సాహ్ని 35,805 ఓట్లతో ఆధిక్యంలో ఉండగా, ఎస్పీకి చెందిన ప్రితీందర్ సింగ్ కక్కు 34,830 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరి ఘటన నేపథ్యంలోనూ బిజెపి అక్కడ దూకుడు చూపించడం ఆసక్తికర పరిణామం. అక్కడ ఎనిమిది నియోజకవర్గాలలో ఏడు స్థానాలలో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉండటం ప్రత్యర్థి పార్టీలు ఊహించని పరిణామం.

Recommended Video

Election Results 2022 : BJP Lead In Three States | Oneindia Telugu
రైతులపై మారణకాండనూ పట్టించుకోని ఓటర్లు, ప్రత్యర్ధి పార్టీలు షాక్

రైతులపై మారణకాండనూ పట్టించుకోని ఓటర్లు, ప్రత్యర్ధి పార్టీలు షాక్

లఖింపూర్ ఖేరిలో రైతుల పై జరిగిన మారణకాండను కూడా పట్టించుకోకుండా రైతులు అక్కడ బీజేపీకి పట్టం కట్టడం ప్రత్యర్థి పార్టీలకు నిజంగా షాక్ అనే చెప్పాలి. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ హవా ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో మరో మార్పు కనిపిస్తుంది. మళ్లీ అక్కడ బిజెపి అధికారంలోకి రానుంది. బీజేపీ పై ఉన్న వ్యతిరేకత ఇక్కడ పని చేయలేదు. బీజేపీకే పట్టం కడుతూ ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

English summary
Shock to Congress, SP, BSP in UP elections. The BJP is also in the lead in UP Lakhimpur Kheri, where the union minister son vehicle run over and violence of farmers took place
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X