వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: ఎనిమిదేళ్ళలో కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు 22.05కోట్ల దరఖాస్తులు, కానీ 7.22 లక్షల మందికే ఉద్యోగాలు!!

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకీ పెరిగిపోతున్నదని , ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరగడం లేదని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ లు ఇవ్వకుండా నిరుద్యోగులను నిరాశ పరుస్తుంది అని, దేశంలో నిరుద్యోగులు తీవ్ర నిరాశా, నిస్పృహలలో ఉన్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల గురించి కీలక సమాచారాన్ని వెల్లడించింది.

ఉద్యోగాల భర్తీ ... పార్లమెంట్ లో సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి

ఉద్యోగాల భర్తీ ... పార్లమెంట్ లో సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి

గత ఎనిమిది సంవత్సరాలలో ఎంత మందిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకున్నారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంత మంది దరఖాస్తులు చేసుకున్నారు అనే లెక్కలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంటులో వెల్లడించారు. ఇక కేంద్రం చెప్పిన లెక్కలు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన వారిలో ఒక శాతం కంటే తక్కువ మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక అయినట్టుగా వెల్లడించింది. ఇప్పుడు గత ఎనిమిదేళ్ళలో ఉద్యోగాల కోసం కొట్లలో దరఖాస్తులు చేస్తే లక్షల్లో ఉద్యోగాలు వచ్చాయన్న అంశం ఆసక్తికరంగా మారింది.

22.05 కోట్లమంది దరఖాస్తు చేయగా, కేవలం 7.22 లక్షల మందికి ఉద్యోగాలు

22.05 కోట్లమంది దరఖాస్తు చేయగా, కేవలం 7.22 లక్షల మందికి ఉద్యోగాలు

2014-15 నుండి 2021-22 వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం 22.05 కోట్లమంది దరఖాస్తు చేయగా, కేవలం 7.22 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైనట్లు వెల్లడించారు కేంద్రమంత్రి. కేవలం 0.33 శాతం మాత్రమే అనేక కేంద్ర అధికార విభాగాల్లో నియామకమైనట్టు ఈ లెక్కల ద్వారా తెలుస్తోంది. కేంద్ర మంత్రి లోక్ సభలో ఇచ్చిన వ్రాతపూర్వక సమాధానంలో, 2014 నుండి 2022 మధ్య రిక్రూట్మెంట్ జరిగిందని మొత్తం రిక్రూట్మెంట్లో 7,22,311 మందిని వివిధ శాఖల్లోకి తీసుకున్నామని వెల్లడించారు.

సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ కాలేదు.. 2014-15 నుండి ఉద్యోగాల భర్తీ ఇలా

సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ కాలేదు.. 2014-15 నుండి ఉద్యోగాల భర్తీ ఇలా

2014-15లో, 1.30 లక్షల మంది అభ్యర్థులు నియామకాలు త్వరగా మంత్రి చెప్పిన లెక్కల ప్రకారం, తరువాతి సంవత్సరాల్లో వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2015-16లో 1.11 లక్షల నియామకాలు, 2016-17లో 1.01 లక్షల నియామకాలు, 2017-18లో 76,147 నియామకాలు, 2018-19లో 38,100 నియామకాలు, 2020-21లో 78,555 నియామకాలు మరియు 2021-22లో 38,850 నియామకాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో గణనీయంగా తగ్గిన నియామకాలను సూచిస్తోంది. సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ కాలేదని కేంద్రమంత్రి చెప్పిన లెక్కలతో తెలుస్తుంది.

దరఖాస్తులు కోట్లలో ఉంటే లక్షల్లో ఉద్యోగాలు

దరఖాస్తులు కోట్లలో ఉంటే లక్షల్లో ఉద్యోగాలు


దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య కోట్లలో ఉంటే ఉద్యోగాలు మాత్రం లక్షలలో వచ్చిన పరిస్థితి భారతదేశంలోని నిరుద్యోగ సమస్య కు అద్దం పడుతుంది. మొత్తంగా చూస్తే ఎనిమిది సంవత్సరాలలో సగటున సంవత్సరానికి 90, 288 ఉద్యోగాలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్నట్లు గా లోక్సభలో అందించిన డేటా ప్రకారం తెలుస్తోంది. 2014 నుండి 2022 వరకు మొత్తంగా 22.05 కోట్ల దరఖాస్తులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాగా, 2018-19లో అత్యధికంగా 5.09 కోట్ల దరఖాస్తులు దాఖలు చేయబడ్డాయి. 2020-21లో - 1.80 కోట్లు ఉద్యోగ దరఖాస్తులు దాఖలు చేశారు. ఈ లెక్కలు దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

English summary
Union Minister Jitendra Singh's revelation in Parliament that 22.05 crore applications for central government jobs in eight years, but jobs were given to only 7.22 lakh people, reflects the severity of unemployment in the country
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X