Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దారుణం.. ప్రియుడి గుండెల్లో కత్తి దింపిన ప్రియురాలు!

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఓ హై-ప్రొఫైల్ హత్యోదంతం స్థానికంగా పెను కలకలం సృష్టించింది. గత రెండేళ్లుగా అన్యోన్యంగా ఉన్నారనుకున్న ఓ జంట మధ్య మద్యం చిచ్చు పెట్టింది. క్షణికావేశంలో ఓ యువతి తన లివ్-ఇన్ పార్ట్‌నర్‌ను కత్తితో పొడిచి ప్రాణాలు తీసింది. మృతుడు దక్షిణ కొరియా పౌరుడు కావడంతో ఈ కేసు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

విలాసవంతమైన సొసైటీలో విషాదం
గ్రేటర్ నోయిడా సెక్టార్-150లోని అత్యంత విలాసవంతమైన 'ఏటీఎస్ పాయస్ హైడ్‌వే' సొసైటీలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇక్కడ నివసించే దక్షిణ కొరియా జాతీయుడు డక్ హీ యుహ్ ఓ ప్రముఖ మొబైల్ కంపెనీలో బ్రాంచ్ మేనేజర్‌గా ఉన్నత హోదాలో పనిచేస్తున్నారు. మణిపూర్‌కు చెందిన లుంజేనా పమాయ్‌తో ఆయన గత రెండు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు.

Shocking Crime in Greater Noida Woman Kills Live-in Partner South Korean National Dies

అసలేం జరిగిందంటే?
జనవరి 4, 2026 ఆదివారం రాత్రి వీరిద్దరూ కలిసి ఇంట్లోనే మద్యం సేవించారు. పార్టీ జోరుగా సాగుతున్న సమయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి మాట పట్టింపు మొదలైంది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు.గొడవ ముదరడంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న లుంజేనా, వంటగదిలోకి వెళ్లి పదునైన కత్తిని తెచ్చి డక్ హీ యుహ్ ఛాతీలోకి బలంగా దింపింది. రక్తపు మడుగులో పడి ఉన్న ప్రియుడిని చూసి భయాందోళనకు గురైన లుంజేనా.. వెంటనే అతడిని గ్రేటర్ నోయిడాలోని జిమ్స్ (GIMS) ఆసుపత్రికి తరలించింది. అయితే పరీక్షించిన వైద్యులు డక్ హీ అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. విదేశీ పౌరుడు కావడంతో ఆసుపత్రి వర్గాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాయి.

విచారణలో వెలుగు చూసిన షాకింగ్ నిజాలు
పోలీసులు లుంజేనాను అదుపులోకి తీసుకుని విచారించగా.. వారి బంధంలోని చీకటి కోణాలు బయటపడ్డాయి. లుంజేనా వెల్లడించిన వివరాల ప్రకారం.. డక్ హీ యుహ్‌ మద్యానికి బానిస అని, తాగిన ప్రతిసారి తనపై విచక్షణారహితంగా దాడి చేసేవాడని ఆమె ఆరోపించింది. చిన్న చిన్న విషయాలకే తనను కొట్టేవాడని, ఆ వేధింపులు భరించలేకపోయానని పేర్కొంది. ఘటన జరిగిన రాత్రి కూడా డక్ హీ తనపై చేయి చేసుకున్నాడని, ఆ ఆవేశంలోనే తాను కత్తితో దాడి చేశానని ఆమె నేరాన్ని అంగీకరించింది.

అంతర్జాతీయ స్థాయిలో స్పందన
ఈ ఘటనపై గ్రేటర్ నోయిడా ఏడీసీపీ సుధీర్ కుమార్ స్పందిస్తూ.. "మేము నిందితురాలిపై హత్య కేసు నమోదు చేశాం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించాం. మృతుడు దక్షిణ కొరియా పౌరుడు కావడంతో, ఈ విషయాన్ని వెంటనే ఆ దేశ రాయబార కార్యాలయానికి అధికారికంగా తెలియజేశాం." అని వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+