కామ పిశాచి: 350 వీడియోలు, 180 మంది ఆడపిల్లల జీవితాలు

ప్రేమ పేరుతో వంచన, కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ క్రూర మృగం వందలాది మంది అబలల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. సుమారు 180 మంది బాలికలను తన మాయమాటలతో ట్రాప్ చేసి, వారి నగ్న వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ఈ 'డిజిటల్ దెయ్యం' ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

మహారాష్ట్రలోని అమరావతి జిల్లా.. పరాత్వడ నగరం ఒక గగుర్పాటుకు గురిచేసే వాస్తవాన్ని ప్రపంచానికి చాటింది. మహమ్మద్‌ అయాజ్‌ అలియాస్‌ తన్వీర్‌ అనే యువకుడు పైకి సాదాసీదాగా కనిపించినా, అతడి ఫోన్ లో ఉన్న చీకటి ప్రపంచం చూసి పోలీసులు సైతం విస్తుపోయారు. ఏకంగా 180 మంది బాలికలను ప్రేమ పేరుతో లోబర్చుకుని, వారిని లైంగికంగా వేధించడమే కాకుండా.. 350కి పైగా అశ్లీల వీడియోలను చిత్రీకరించిన ఈ ఉన్మాదిని పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు.

Shocking Maharashtra Crime Digital Predator Filmed 350 Leaked Videos of 180 Girls Under Pretext of Love

మాయమాటలతో ముంబైకి.. అక్కడ నరకప్రాయం!

నిందితుడు తన్వీర్ వ్యూహం చాలా ప్రమాదకరంగా ఉండేది. స్థానిక బాలికలను టార్గెట్ చేసుకుని, వారు తన ప్రేమలో పడేలా నటించేవాడు. ఆ తర్వాత మాయమాటలు చెప్పి వారిని ముంబై, పూణే వంటి మహానగరాలకు తీసుకువెళ్లేవాడు. అక్కడ వారిని లైంగికంగా వాడుకోవడమే కాకుండా, ఎవరికీ తెలియకుండా రహస్యంగా అశ్లీల వీడియోలను చిత్రీకరించేవాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని వారిని బ్లాక్‌మెయిల్ చేస్తూ, కొందరి వీడియోలను ఆన్‌లైన్‌లో కూడా అప్లోడ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎంపీ ఎంట్రీతో కదిలిన యంత్రాంగం..

ఈ దారుణంపై కొందరు బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి రాజ్యసభ ఎంపీ అనిల్‌ బోండేకు ఒక వినతిపత్రం సమర్పించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఎంపీ తీవ్రంగా స్పందించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఎస్పీ కార్యాలయం ముందు నిరసనకు దిగుతానని హెచ్చరించడంతో పోలీసులు రంగంలోకి దిగి తన్వీర్‌ను అరెస్టు చేశారు.

ఫోన్ నిండా నగ్న వీడియోల కుప్ప!

పోలీసులు నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అందులో వందల కొద్దీ అసభ్యకరమైన వీడియోలు లభ్యమయ్యాయి. కోర్టు అతడికి ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈ వీడియోలను నిందితుడు ఏవైనా పోర్న్ సైట్లకు విక్రయించాడా? లేదా ఇతర వ్యక్తులకు షేర్ చేశాడా? అనే కోణంలో సైబర్ సెల్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉన్న వీడియోలను తొలగించే ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు.

ఈ ఘటనతో మహారాష్ట్రలో బాలికల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. సోషల్ మీడియా మాయలో పడి అపరిచిత వ్యక్తులను నమ్మి జీవితాలను బలి చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+