షాకింగ్: రాఫెల్ ఒప్పందం పై ప్రధాని మోడీకి మద్దతుగా నిలిచిన శరద్ పవార్
Recommended Video

ఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు రాఫెల్ ఒప్పందంపై ప్రధాని మోడీని టార్గెట్ చేస్తుండగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాత్రం మోడీకి మద్దతుగా నిలిచారు. మోడీ ఉద్దేశంపై ప్రజల్లో ఎలాంటి అనుమానాలు లేవని చెప్పి పెద్ద బాంబే పేల్చారు. ఓ మరాఠీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శరద్ పవరా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. రాఫెల్ డీల్‌కు సంబంధించి సాంకేతిక అంశాలను బహిర్గతం చేయాలని విపక్షాలు చెప్పడం ఆయన తప్పుబట్టారు. అయితే రాఫెల్ ఒప్పందానికి సంబంధించి కొనుగోలు ధరలు బహిర్గతం చేస్తే ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం రాదని పేర్కొన్నారు.
రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాఫెల్ ఒప్పందంకు సంబంధించిన విషయాలు చెప్పాల్సిన పద్ధతిలో చెప్పకుండా ప్రజల్లో గందరగోళం సృష్టించిందని ఆరోపించారు. ఇంత రభస జరుగుతుంటే రక్షణశాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పకుండా ఆర్థికశాఖ మంత్రి జైట్లీ సమాధానం చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.

రాఫెల్ ఒప్పందంలో అవినీతి చోటుచేసుకుందని కాంగ్రెస్ బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తోంది. మోడీ సర్కార్ అనిల్ అంబానీకి మేలు చేయడం కోసమే రిలయన్స్ డిఫెన్స్ సంస్థను ఆఫ్‌సెట్ పార్ట్‌నర్‌గా చేరుస్తున్నారని కాంగ్రెస్ ధ్వజమెత్తుతోంది. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే కూడా నాడు రిలయన్స్ డిఫెన్స్‌ను ప్రతిపాదించింది భారత ప్రభుత్వమే అని స్పష్టంగా చెప్పారని...దీంతో ఈ ఒప్పందంలో అవినీతి జరిగినట్లు స్పష్టమవుతోందని మండిపడింది కాంగ్రెస్. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను కాదని రక్షణ రంగంలో ఎలాంటి అనుభవం లేని రిలయన్స్ డిఫెన్స్‌కు ఒప్పందం అప్పగించి ప్రజల డబ్బును వ్యర్థం చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications