కాబోయే అల్లుడితో అత్త జంప్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
పది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ లో కాబోయే అల్లుడితో అత్త జంప్ అయిన కేసు ప్రతి ఒక్కరిని షాక్ కు గురిచేసింది. కన్నబిడ్డ వివాహం చేయాల్సిన ఓ తల్లి బిడ్డకు కాబోయే భర్తని తీసుకొని ఇంట్లోంచి పారిపోయిన కేసు సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఇక తాజాగా ఈ కేసులో అనేక షాకింగ్ ట్విస్టులు బయటకు వస్తున్నాయి.
కాబోయే అల్లుడితో జంప్ అయిన అత్త షాకింగ్ విషయాలు
కూతురి పెళ్ళికి ముందు కాబోయే అల్లుడితో నగలు, డబ్బులతో పారిపోయిన మహిళను బీహార్లోని నేపాల్ సరిహద్దుకు దగ్గరలోని ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆమె తన నిర్ణయానికి సంబంధించి అనేక షాకింగ్ విషయాలు వెల్లడించింది.

నగలు, నగదు తీసుకువెళ్లలేదని పోలీసులకు చెప్పిన మహిళ
అనిత అలియాస్ స్వప్న దేవి తాను తన భర్తతో కలిసి జీవించడానికి ఇష్టపడడం లేదని తన భర్త జితేంద్ర తనను సరిగ్గా చూసుకోవడం లేదని తనను పదేపదే అనుమానిస్తాడు అని పోలీసులకు వెల్లడించింది. కానీ ఇంటి నుంచి ఎటువంటి నగలు నగదు తీసుకొని వెళ్లలేదని కేవలం తన కాళ్లకు ఉన్న పట్టీలు, మెడలో ఉన్న మంగళసూత్రం తప్ప తాను ఏమి తీసుకు రాలేదని పేర్కొంది.
వేధించే భర్త వద్దు.. అతనితో జీవిస్తా
1500 రూపాయల కోసం తన భర్త తనను తీవ్రంగా కొట్టాడని, ఉదయం నుంచి సాయంత్రం వరకు మద్యం తాగుతూనే ఉండే, వేధించే భర్తతో తాను కాపురం చేయలేనని పోలీసులతో వెల్లడించింది. తనను టార్చర్ పెట్టే భర్త కంటే రాహుల్ తో కలిసి ఉండడం తనకు ఇష్టమని ఆమె పేర్కొంది. తాను రాహుల్ ను తీసుకొని వెళ్ళింది వాస్తవమే కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదని అతనితోనే జీవిస్తా అంటూ వెల్లడించింది.
కాబోయే అల్లుడికి దగ్గరైంది అందుకే
తన భర్త ఆరు నెలలుగా ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటూ, ఉదయం నుంచి సాయంత్రం వరకు మద్యం తాగుతూ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని, కనీసం ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదని పేర్కొంది. రాహుల్ తనను ఆప్యాయంగా పలకరించే వాడని, తన కష్టాలు అర్థం చేసుకుని ఓదార్చే వాడని అనిత దేవి పోలీసులకు చెప్పింది. దీంతోనే తను రాహుల్ కి దగ్గర అయినట్టు పేర్కొంది.
కూతురికి వేరేవాడు దొరుకుతాడు.. నేను అల్లుడిని వదలలేను
కూతురుకి మరొక మంచి వ్యక్తి భర్తగా దొరుకుతాడు అని, తనకు రాహుల్ ని మించి మంచివాడు, అర్థం చేసుకునే వాడు దొరకడని అందుకే తనతో వెళ్లిపోయానని పేర్కొంది. భర్త పదేపదే అల్లుడితో కలిపి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసేవాడని, తనను టార్చర్ పెట్టే వాడని, అందుకే ఆ మాటలు నిజం చేశానంటూ వెల్లడించింది. అతనితో కలిసి జీవిస్తానని, తనకోసం ఎవరు వెతకొద్దు అంటూ కూడా ఆమె పేర్కొంది.












Click it and Unblock the Notifications