కేజ్రీపైకి బూటు విసిరిన ఆమ్ ఆద్మీ సేన కార్యకర్త

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ మీదికి ఓ వ్యక్తి బూటు విసిరాడు. సరి, బేసి సంఖ్య కార్ల వాడకంపై మీడియా సమావేశంలో వివరిస్తుండగా ఆ వ్యక్తి ముఖ్యమంత్రిపైకి బూటు విసిరాడు. అతన్ని ఆమ్ ఆద్మీ సేన కార్యకర్తగా గుర్తించారు.

తమపై స్టింగ్ ఆపరేషన్ చేయిస్తున్నారనే ఆరోపణపై అతను కేజ్రీవాల్ మీదికి షూ విసిరినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను విసిరిన బూటు కేజ్రీవాల్‌కు తగలలేదు. ఆయన పక్కన అది పడింది.

Shoe Thrown At Arvind Kejriwal During At Odd-Even Announcement

సిఎన్‌జి ఫిట్నెస్ పథకం విషయంలో స్టింగ్ ఆపరేషన్‌పై కేజ్రీవాల్ ప్రతిస్పందించాలని బూటు విసరడానికి ముందు ఆ వ్యక్తి కేకలు వేస్తూ అడిగాడు. బూటు విసిరిన వెంటనే గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని పట్టుకుని కొట్టారు. ఈ నెల 15వ తేదీ నుంచి బేసి, సరి సంఖ్య కార్ల వాడకాన్ని తిరిగి ప్రారంభిస్తున్న విషయాన్ని కేజ్రీవాల్, రవాణా శాఖ మంత్రి గోపాల్ రాయ్ వివరిస్తుండగా ఆ సంఘటన జరిగింది.

బూటు విసిరిన వ్యక్తిని పోలీసులు పట్టుకుని తీసుకుని వెళ్లిన తర్వాత కేజ్రీవాల్ తన మీడియా సమావేశాన్ని కొనసాగించారు. ఢిల్లీలో రెండోసారి ప్రవేశపెడుతున్న సరి, బేసి సంఖ్య కార్ల వాడకంపై ఆయన వివరాలు అందించారు. ఇంతకు ముందు ఆ విధానాన్ని జనవరి 1, జనవరి 15 తేదీల మధ్య అమలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+