‘పాక్ జెండాలు ఎగురేసినవారిని కాల్చిపారేయండి’
రాజ్కోట్: పాకిస్థాన్ అనుకూలవాదులపై కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాశ్మీర్లో పాక్ జెండాలు ఎగురేస్తున్నవారిని కాల్చి చంపండని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.
గుజరాత్లోని కచ్ జిల్లాలో ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పాక్ జెండాలు ఎగురేవేసి పాక్ అనుకూల నినాదాలు చేస్తున్నవారి ఛాతిలో తుపాకుల గుళ్లు దించాలని అన్నారు.

కాశ్మీర్లో పరిస్థితి గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. వేర్పాటువాదులపై తగినస్థాయిలో చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వేర్పాటువాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
కాగా, ఇటీవల పలుమార్లు పాకిస్థాన్ జెండాలు ఎగురవేసిన వేర్పాటువాదులు, పాక్ అనుకూల నినాదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేర్పాటువాద నేత సయ్యద్ అలీషా గిలానీతోపాటు పలువురు నేతలను పోలీసులు ఇంట్లోనే బంధించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications