ఇంత చేసినా ఓడించారు: సిద్ధరామయ్య కన్నీటిపర్యంతం, సీనియర్ నేతల విమర్శలు

బెంగళూరు: కర్ణాటక తాజా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎన్నికల్లో ఓటమిపై భావోద్వేగానికి గురయ్యారు. పేదలు, దళితులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి కాంగ్రెస్‌ చేసిన కృషిని ఎవరూ పట్టించుకోలేదంటూ సిద్ధరామయ్య కన్నీటి పర్యంతమయ్యారు.

బుధవారం బెంగళూరులోని పీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశంలో సిద్ధరామయ్య తన ఆవేదనను వెలిబుచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంపట్ల ఎంతో విశ్వాసంతో ఉన్నా.. ఫలితం మాత్రం మరోలా వచ్చిందని అన్నారు.

Siddaramaiah gets emotional at MLAs’ meet, senior leaders blame him for defeat

ప్రజల కోసం రూపొందించిన సంక్షేమ పథకాలను విస్మరించి కులాలు, జాతుల అంశానికే ప్రాధాన్యమిస్తూ జనం మమ్మల్ని ఓడించారని ఆవేదన చెందారు. తమ ప్రణాళికను ప్రజలే మార్చేశారని ఉద్వేగానికి లోనయ్యారు.

రాష్ట్రంలో శాంతి, సామరస్యాలను కాపాడాలంటే కాంగ్రెస్‌, దళ్‌ శాసనసభ్యులెవరూ బీజేపీలోకి వెళ్లవద్దని పిలుపునిచ్చారు. ఇది ఇలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఓటమికి సిద్ధరామయ్యే కారణమంటూ పలువురు సీనియర్ నేతలు విమర్శలు చేస్తుండటం కూడా ఆయనను వేదనకు గురిచేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+