వరుణ దేవుడు కాదుకదా కరుణ దేవుడు కూడా కాపాడలేడు, గోవింద జోస్యం !
బెంగళూరు/ బాగల్ కోటే: కర్ణాటకలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర మంత్రి గోవింద కారజోళ జోస్యం చెప్పారు. మేము అధికారంలోకి వస్తామని పదేపదే గొప్పలు చెప్పుకుంటున్న మాజీ సీఎం సిద్దరామయ్యను ఈసారి వరుణ దేవుడు కాదుకదా కరుణ దేవుడు కూడా కాపాడలేడని బీజేపీ సీనియర్ మంత్రి గోవింద కారజోళ అన్నారు.
మాజీ సీఎం సిద్దరామయ్య వరుణా నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తుందని, మేమే అధికారంలోకి వస్తామని మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ పగటి కలలు కంటున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు, మంత్రి గోవింద కారజోళ మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రానప్పుడు సిద్దరామయ్య సీఎం ఎలా అవుతారు ? అని గోవింద కారజోళ ప్రశ్నించారు. ఈ జన్మలో సిద్దరామయ్య సీఎం కాలేరని, ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం ఫలితం ఉండదని బీజేపీ నాయకుడు గోవింద కారజోళ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదని గోవింద కారజోళ అన్నారు.
బుధవారం ఓటరు దేవుళ్లు బీజేపీని ఆదరించారని, మా పార్టీకి ఓట్లు వేశారని, కర్ణాటకలో 130 సీట్లలో బీజేపీ విజయం సాధించి మరోసారి అధికారంలోకి వస్తుందని, అందులో ఎలాంటి డౌట్ లేదని గోవింద కారజోళ అన్నారు. దళపతి హెచ్ డీ. కుమారస్వామి ఈసారి కింగ్ మేకర్ అవుతారా అనే ప్రశ్నకు గోవింద కారజోళ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

బీజేపీకి 130 సీట్లు వచ్చి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇక కుమారస్వామి ఎలా కింగ్ మేకర్ అవుతారు ? అని మంత్రి గోవింద కారజోళ ప్రశ్నించారు. తాను ముధోళ నియోజక వర్గ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఇంతకాలం వారు ఏమి అడిగితే అది చేసి పెట్టానని, తాను భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని గోవింద కారజోళ అన్నారు.
ముధోళ నియోజక వర్గం ప్రజలు తనను ఓసారి ఉప ముఖ్యమంత్రి, మరోసారి మంత్రిని చేశారని, తన మీద నమ్మకంతో మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తారని మంత్రి, బీజేపీ సీనియక్ నాయకుడు గోవింద కారజోళ ధీమా వ్యక్తం చేశారు. మొత్తం మీద సిద్దరామయ్య ఆయన జీవితంలో మరోసారి ముఖ్యమంత్రి కాలేరని గోవింద కారజోళ జోస్యం చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications