అండగా ఉండాలి, బీజేపీ ద్రోహం: తెలుగు ప్రజలకు కన్నడ సీఎం సిద్ధరామయ్య లేఖ

బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలోని తెలుగు ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓ లేఖ రాశారు. ఈసారి ఎన్నికల్లోనూ తెలుగు ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు.

ఎన్నికల హామీలను 95శాతం అమలు చేశామని, మళ్లీ తమకే అవకాశం కల్పించాలని సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. తెలుగువారు, కన్నడిగులది తరతరాల సోదర బంధమని సిద్ధరామయ్య గుర్తు చేశారు.

siddaramaiah writes a letter to Telugu people in Karnataka

దశాబ్దాలుగా తెలుగువారు ఇక్కడ స్థిరపడి ఇక్కడి సంస్కృతిలో భాగమయ్యారని సీఎం సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బీజేపీ ద్రోహం చేసిందని విమర్శించారు.

విభజన హామీలు అమలు చేయకుండా ఏపీ, తెలంగాణకు అన్యాయం చేసిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేశామని సిద్ధరామయ్య ఆ లేఖలో పేర్కొన్నారు. కర్ణాటకలోని పలు జిల్లాల్లో అత్యధిక ఓటింగ్ శాతంగా తెలుగువారు ఉండటంతో అన్ని పార్టీలు కూడా మనవారిపైనా ప్రధానంగా దృష్టిపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+