వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనూహ్యం: వారిద్దరి పైనే సిద్దూపోటీ, ఆయనది చెత్త నిర్ణయం

కాంగ్రెస్ పార్టీలో మాజీ క్రికెటర్ సిద్దూ చేరడం అత్యంత చెత్త నిర్ణయమని బిజెపి విమర్శించింది.ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ పోటీచేస్తున్న లాంబీ ,ఉప ముఖ్యమంత్రి పోటీచేస్తోన్న జలాలబాద్ .

By Narsimha
|
Google Oneindia TeluguNews

పంజాబ్ : మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ బిజెపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని బిజెపి తప్పుబట్టింది. ఈ నిర్ణయాన్ని సిద్దూ తీసుకొన్న అత్యంత చెత్త నిర్ణయంగా ప్రకటించింది.అయితే కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల సిద్దూ స్పందించాడు. తాను స్వంత ఇంటికి చేరుకొన్నట్టుగా ఉందని ఆయన సిద్దూ అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ క్రికెటర్ సిద్దూ, బిజెపిలో చేరిన బియాంత్ సింగ్ కుమార్తె

రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో సిద్దూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగుుతున్నందున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సిద్దూకు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతామని ఆ ఫార్టీ ఆపర్ ప్రకటించింది.

ఉచిత హమీలు, సిద్దూ పంజాబ్ లో కాంగ్రెస్ ను గట్టెక్కిస్తాయా?

ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే బిజెపికి సిద్దూ రాజీనామా చేశారు. బిజెపిలో తనకు అన్యాయం జరిగిందనే అభిప్రాయంతోనే సిద్దూ ఈ నిర్ణయం తీసుకొన్నాడు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీని ఎంచుకొన్నాడు.

మేం పోటీచేయం, కాని, బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం, ఎవరికి లాభం?

ఆప్ లో చేరతారనే ప్రచారం సాగినా, చివరకు సిద్దూ కాంగ్రెస్ పార్టీని ఎంచుకొన్నాడు,. ఉపముఖ్యమంత్రి పదవితో పాటు ఇతర డిమాండ్లను కూడ కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉండడంతో ఆయన కాంగ్రెస్ పార్టీని ఎంచుకొన్నాడు.

సిద్దూది అత్యంత చెత్త నిర్ణయం

సిద్దూది అత్యంత చెత్త నిర్ణయం

మాజీ క్రికెటర్ సిద్దూ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని బిజెపి తప్పుబట్టింది. సిద్దూ తన జీవితంలో తీసుకొన్న అతి చెత్త నిర్ణయమని బిజెపి విమర్శలు గుప్పించింది. ఈ నిర్ణయం తీసుకొన్నందుకు గాను సిద్దూ బాధపడుతాడని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ వర్గియ అభిప్రాయపడ్డారు. సిద్దూ కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండబోదని ఆయన చెప్పారు.పంజాబ్ లో జరిగే ఎన్నికల్లో బిజెపి అకాలీదళ్ సంకీర్ణ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన అభిప్రాయపడ్డారు.

స్వంత ఇంట్లోకి వచ్చినట్టుందన్న సిద్దూ

స్వంత ఇంట్లోకి వచ్చినట్టుందన్న సిద్దూ

రెండురోజుల క్రితం మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత న్యూఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నాడు సిద్దూ మీడియాతో మాట్లాడారు. తన తండ్రి 40 ఏళ్ళపాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారని ఆయన గుర్తు చేసుకొన్నాడు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తనకు స్వంత ఇంటికి వచ్చినట్టుగా ఉందని ఆయన చెప్పారు.

డ్రగ్స్ మాఫియాపై పోరాటం

డ్రగ్స్ మాఫియాపై పోరాటం

పం.జాబ్ లో డ్రగ్స్ మాఫియా విస్తరించిందని సిద్దూ ఆవేదన చెందారు. ఈ డ్రగ్స్ కారణంగా యువత పెడదారి పడుతోందని ఆయన చెప్పారు. డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాదక ద్రవ్యాలను అరికడతామని ఆయన హమీ ఇచ్చారు.సిద్దూ సతీమణి నవజ్యోత్ కౌర్ సిద్దూ కంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ముఖ్యమంత్రిపై సిద్దూ పోటీ?

ముఖ్యమంత్రిపై సిద్దూ పోటీ?

పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ లాంబీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేస్తున్నాడు. అయితే సిద్దూ ను అదే నియోజకవర్గం నుండి బరిలోకి దింపే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గం నుండి పోటీచేయకపోతే ఉప ముఖ్యమంత్రి సుక్ బీర్ సింగ్ బాదల్ కు వ్యతిరేకంగా బరిలోకి దింపే అవకాశం ఉంది. జలాలాబాద్ నుండి డిప్యూట్ సిఎం సుఖ్ బీర్ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఫిబ్రవరి నాలుగో తేదిన పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి.

English summary
sidhu will contest from lambi or jalalabad assembly segments , sidhu worrest decission joing in congress party alleged bjp , recently skdhu joined in congress .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X