ఒడిశా రైలు ప్రమాదానికి అసలు కారణమిదే-రైల్వేశాఖ ప్రాథమిక నివేదికలో వెల్లడి
ఒడిశాలోని బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీకొన్న ఘటన దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనలో 280 మందికిపైగా చనిపోయారని అంచనా వేస్తున్నారు. మరో వెయ్యి మంది వరకూ గాయపడ్డారు. ఈ ఘటనపై రైల్వేశాఖ ప్రాథమిక దర్యాప్తు చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో షాకింగ్ అంశాలు వెలుగుచూశాయి. నిన్న రాత్రి ఈ ఘటన జరిగిన వెంటనే భిన్నకథనాలు వినిపించిన నేపథ్యంలో రైల్వేశాఖ ప్రాథమిక దీనిపై క్లారిటీ ఇచ్చింది.
ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వేశాఖ ఉన్నతాధికారులకు ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో సిగ్నల్ లోపం వల్లే కోరమండల్ రైలు ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా తేల్చింది. మెయిన్ లైన్ లో వెళ్లేందుకు కోరమండల్ కు సిగ్నల్ ఇవ్వాల్సి ఉండగా... అది కాస్తా తప్పుగా పడి లూప్ లైన్ కు వెళ్లేందుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. లూప్ లైన్ లో ఆగివున్న గూడ్స్ ను కోరమండల్ ఢీకొన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. మెయిన్ లైన్ పై వెళ్లేందుకు కోరమండల్ కు సిగ్నల్ ఇచ్చారని, కానీ కోరమండల్ రైలు పొరపాటున లూప్ లైన్ లోకి వెళ్లిందని అధికారులు తేల్చారు.

ఈ నివేదికలో లూప్ లైన్ లో ఆగివున్న గూడ్స్ ను కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొన్నట్లు అధికారులు ప్రత్యక్ష సాక్ష్యులు, ఘటనా స్ధలిలో లభించిన ఆధారాలను బట్టి గుర్తించారు. అలాగే కోరమండల్ ఎక్స్ ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొన్న సమయంలోనే బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ మరో ట్రాక్ పైకి వచ్చిందని గుర్తించారు. అప్పటికే సదరు ట్రాక్ పై కోరమండల్ బోగీలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ కూడా వాటిని గుద్దుకుని నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి.
ఇలా వరుసగా రైళ్లు ఒకదానికొకటి గుద్దుకోవడం వల్ల భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు తేల్చారు. అలాగే రాత్రి సమయం కావడంతో వెంటనే క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించడం కూడా సమస్యగా మారినట్లు సమాచారం. చివరికి సైన్యాన్ని రంగంలోకి దింపి మరీ క్షతగాత్రుల్ని, కొన ఊపిరితో ఉన్న వారిని అంబులెన్స్ ల్లో చుట్టుపక్కన జిల్లాల్లోని ఆస్పత్రులకు తరలించారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమృత్ భారత్ రైలులో పురిటి నొప్పులు.. కట్ చేస్తే ఆసుపత్రికి వెళ్ళేలోపే..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications