ఎన్‌కౌంటర్‌లతో దద్దరిల్లిన జమ్మూకాశ్మీర్: ఇద్దరు పాకిస్థానీలతో సహా ఆరుగురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. జమ్మూకాశ్మీర్లో, అలాగే భారత దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించడానికి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత దేశంలోకి చొరబడ్డారని ఇంటిలిజెన్స్ సమాచారంతో జమ్మూకశ్మీర్ లో భద్రతా దళాలు కంటి మీద కునుకు లేకుండా ఉగ్ర మూక కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఒక పక్క డ్రోన్ల దాడులను, మరోపక్క వాస్తవాధీన రేఖ వద్ద చొరబాట్లను ఎదుర్కొంటూ ఉగ్రవాదులపై పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నాయి. 2021 సంవత్సరంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ చేపట్టి ఉగ్రవాదులను మట్టుపెట్టే పనిలో ఉంది ఇండియన్ ఆర్మీ.

 కుల్గాం, అనంత నాగ జిల్లాలలో రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లు.. ఆరుగురు ఉగ్రవాదులు హతం

కుల్గాం, అనంత నాగ జిల్లాలలో రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లు.. ఆరుగురు ఉగ్రవాదులు హతం

తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ మరియు అనంత్‌నాగ్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు పాకిస్తాన్ జాతీయులతో సహా ఆరుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. అనంతనాగ్, కుల్గాం జిల్లాలలో బుధవారం సాయంత్రం భద్రతా బలగాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ను ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులు తారసపడడంతో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుందని అధికారులు చెబుతున్నారు. కుల్గామ్‌లో ముగ్గురు జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక పాకిస్తాన్ ఉగ్రవాదితో పాటు ఇద్దరు స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించారు.

6 జైషే మహమ్మద్ ఉగ్రవాదులలో ఇద్దరు పాకిస్తాన్ జాతీయులు

అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్‌లో రాత్రి 2 గంటల సమయంలో జరిగిన కాల్పుల్లో మరో ఉగ్రవాది హతమయ్యాడని వెల్లడించారు. హతమైన ఉగ్రవాదులను ట్రాల్‌కు చెందిన మహ్మద్ షఫీ దార్, మిర్హామాకు చెందిన ఉజైర్ అహ్మద్‌గా గుర్తించారు. ఇద్దరూ నిషేధిత తీవ్రవాద సంస్థ జైష్ ఎ మొహమ్మద్ కి చెందిన సి కేటగిరీ టెర్రరిస్టులని మరియు ఒకరు పాకిస్తానీ ఉగ్రవాది షాహిద్ అలియాస్ షాజైద్‌గా గుర్తించారని సమాచారం. షాహిద్ అలియాస్ షాజైద్ జమ్మూ కాశ్మీర్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరుగా గుర్తించబడ్డారు. మరికొందరిని గుర్తించాల్సి ఉంది.

 ఎన్కౌంటర్లలో ఒక ఆర్మీ జవాన్ మృతి, మరో ఇద్దరు ఆర్మీ జవాన్లకు , ఒక జమ్మూ పోలీస్ కు గాయాలు

ఎన్కౌంటర్లలో ఒక ఆర్మీ జవాన్ మృతి, మరో ఇద్దరు ఆర్మీ జవాన్లకు , ఒక జమ్మూ పోలీస్ కు గాయాలు


అంతేకాదు రెండు ఎన్కౌంటర్లలో ముగ్గురు ఆర్మీ జవాన్లు , ఒక జమ్మూ కాశ్మీర్ పోలీస్ జవాన్ గాయపడ్డారు. వీరిని ఆసుపత్రిలో చేర్పించగా ఒక ఆర్మీ జవాన్ వీరమరణం పొందాడు. మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని పేర్కొన్నారు. కుల్గాం ప్రాంతాల్లో మరో ఉగ్రవాది ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా వీరికోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్ స్థలం నుండి రెండు ఏకే 47 మరియు ఒక ఎం4 రైఫిల్స్‌తో పాటు ఇతర మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఏడాది కశ్మీర్‌లో 86 ఎన్‌కౌంటర్లలో 168 మంది ఉగ్రవాదులు హతం

ఈ ఏడాది కశ్మీర్‌లో 86 ఎన్‌కౌంటర్లలో 168 మంది ఉగ్రవాదులు హతం


రికవరీ చేయబడిన అన్ని మెటీరియల్స్ తదుపరి దర్యాప్తు కోసం మరియు ఇతర ఉగ్రవాద నేరాలలో వారి భాగస్వామ్యాన్ని పరిశోధించడానికి కేసు రికార్డులలోకి తీసుకోబడ్డాయని జమ్ము కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది కశ్మీర్‌లో 86 ఎన్‌కౌంటర్లలో 168 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. వీరిలో 19 మంది ఉగ్రవాదులు విదేశీయులు కాగా, 149 మంది స్థానికులు ఉన్నారు.ఇటీవల జమ్మూకాశ్మీర్లో లష్కరే తోయిబాకు చెందిన టాప్ ఉగ్రవాది అబూ జరార్ ను భద్రతా దళాలు అంతమొందించారు. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో లష్కరే తోయిబా కి చెందిన పాకిస్థానీ అగ్రశ్రేణి ఉగ్రవాది అబుజరార్ హతమయ్యాడని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+