ఫోటో దిగుతూ ప్రాణాలు పోగొట్టుకొన్నాడు

సరదాగా ఫోటోలు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఓ పిల్లర్ పై నుండి రాయి పడి ఆరేళ్ళబాలుడు విక్రం మరణించాడు. ఈ ఘటన బెంగుళూర్ లో చోటుచేసుకొంది. తల్లిదండ్రులు, బంధువులతో కలిసి ఆరేళ్ళ బాలుడు విక్రం సోమవారం

బెంగుళూరు :సరదా కోసం వెళ్ళి ఆరేళ్ళ బాలుడు మరణించాడు. సెల్పీలు, ఫోటోలు తీసుకొంటూ సరదాగా గడుపుతున్నారు. అయితే సరదాగా పోటోకు ఫోజులిస్తూన్న ఆరేళ్ళ బాలుడిపై ఓ రాయి పడి అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన బెంగుళూరులో చోటుచేసుకొంది.

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులోని లాల్ బాగ్ సందర్భనకు విక్రం అనే బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి వెళ్ళాడు. తన కొడుకును పిల్లర్ పక్క నుండి ఫోటో తీస్తుండగా ప్రమాదవశాత్తు పిల్లర్ పై నుండి రాయి పడి ఆరేళ్ళ బాలుడు విక్రం అక్కడికక్కడే మరణించాడు.

six years old boy dies after stone from a pillar hits him

బెంగుళూరుకు సమీపంలోని శ్రీరామపురానికి చెందిన కుమార్ , రేవతిలు తమ ఆరేళ్ళ కుమారుడు విక్రంతో కలిసి బెంగుళూరులోని లాల్ బాగ్ లోని ఉద్యానవనానికి వెళ్ళారు.వీరితో పాటు వారి బంధువులకు చెందిన మరో ఇద్దరు అమ్మాయిలు కూడ ఉన్నారు. ఈ ఉద్యానవనంలో చక్కటి ప్రదేశాల్లో ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ వారు ఆనందంలో ఉన్నారు.

విక్రం ను తీసుకొని ఇద్దరు యువతులు ఓ పిల్లర్ పక్క నుండి ఫోటో తీసేందుకు ప్రయత్నిస్తుండగా పిల్లర్ పై నుండి రాయి పడి ఆరేళ్ళ బాలుడు విక్రం చనిపోయాడు. అయితే ఉద్యానవనాన్ని సందర్శించేందుకు వచ్చిన వారు ఎక్కువగా సెల్పీలు , ఫోటోలు దిగడంలో మునిగిపోయారు. అయితే విక్రంపై పడిన రాయిని తొలగించేందుకు సకాలంలో రాకపోవడం కూడ విక్రం మరణానికి కారణమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+