వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

26/11 ఉగ్రవాద దాడులకు నేటితో ఆరేళ్లు పూర్తి.. అమరవీరులకు నివాళులు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: ముంబైలో 26/11 ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు పలువురు నివాళులు అర్పించారు. అమరవీరుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహారాష్ట్ర డీజీపీ సంజీవ్ దాయాల్‌లతో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు శ్రధ్దాంజలి ఘటించారు. 26/11దాడులు జరిగి ఈరోజుతో ఆరు సంవత్సరాలు పూర్తైంది.

ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర డీజీపీ సంజీవ్ దాయాల్‌ మాట్లాడుతూ నగరంలో శాంతి భద్రతలు, ఉగ్రవాద నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపడుతున్నామన్నారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, తాజ్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, చాబాద్ హౌస్ తదితర ప్రాంతాల్లో సంస్మరణ కార్యక్రమాలు చేపట్టారు.

గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ముంబై దాడి ఘటనకు నివాళిగా సంస్మరణ కార్యక్రమం చేపట్టారు. మృత వీరులకు ఘనంగా నివాళులర్పించారు. చిన్నారులు స్కేటింగ్ ర్యాలీ నిర్వహించారు. నగరంలో భద్రతా చర్యలు మరింతగా పెంపొందించాల్సి ఉందని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అభిప్రాయపడ్డారు.

ఇక నేపాల్ రాజధాని ఖాట్మండ్‌లో 18వ సార్క్ సమావేశాలకు హాజరైన ప్రధాని మోడీ సమావేశంలో ముంబై 26/11 దాడులను గుర్తుచేసుకున్నారు. ఆనాటి ఆనాడు జరిగిన దాడులను భారత ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు.

ఆ గాయం అంత సులువుగా మానిపోయేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలన్నీ కలిసి ఉగ్రవాదంపై సమిష్టిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. 2008 ముంబై దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పాయారని ప్రధాని మోడీ గుర్తు చేశారు.

26/11 ఉగ్రవాద దాడులకు నేటితో ఆరేళ్లు పూర్తి.. అమరవీరులకు నివాళులు

26/11 ఉగ్రవాద దాడులకు నేటితో ఆరేళ్లు పూర్తి.. అమరవీరులకు నివాళులు

ముంబైలో 26/11 ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు పలువురు నివాళులు అర్పించారు. నివాళులు అర్పించేందుకు వస్తున్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సాలస్కర్ భార్య స్మితా, కూతురు దివ్య.

 26/11 ఉగ్రవాద దాడులకు నేటితో ఆరేళ్లు పూర్తి.. అమరవీరులకు నివాళులు

26/11 ఉగ్రవాద దాడులకు నేటితో ఆరేళ్లు పూర్తి.. అమరవీరులకు నివాళులు

ముంబైలో 26/11 ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు పలువురు నివాళులు అర్పించారు. అమరవీరులకు నివాళులు అర్పిస్తున్న కుటుంబ సభ్యులు.

ముంబైలో 26/11 ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు పలువురు నివాళులు అర్పించారు. ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ చైర్మన్ ఎమ్ఎస్ భిట్టా నివాళులర్పిస్తున్న దృశ్యం.

English summary
At all the sites in Mumbai targeted by terrorists on November 26, 2008, the gruesome scars of that attack are no longer visible, except at the Nariman House which housed the Jewish Chabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X