వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మోకింగ్ పనిష్మెంట్: ఏమిటీ టెక్నిక్.. ఇలా చేస్తే సిగరెట్లు మానేయవచ్చా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సిగరెట్

సిగరెట్లు మానేయాలని అనుకుంటున్నారా? అయితే, ఒక్క రోజులోనే పూర్తిగా మానేయాల్సిన పనిలేదు. ఇకపై సిగరెట్ కాల్చే ప్రతిసారీ.. ఎవరూలేని చోటుకు వెళ్లి ఒంటరిగా గోడవైపు తిరిగి నిలబడి సిగరెట్ కాల్చండి.

ధూమపానాన్ని మానేయడమే లక్ష్యంగా తన దగ్గరకు వచ్చే వచ్చేవారికి కార్డియాలజిస్టు జాక్వెలిన్ స్కాల్జ్ ఇదే చెబుతున్నారు.

సవ్‌పాలో యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో జాక్వెలిన్ ప్రొఫెసర్. మరోవైపు సవ్‌పాలో ఇన్‌స్టిట్యూటో డో కారకావో (ఇన్‌కార్)లో టొబాకో అడిక్షన్ ట్రీట్‌మెంట్ ప్రోగ్రామ్‌కు ఆమె డైరెక్టర్. బ్రెజిల్‌లో సిగరెట్లు మానేయడంలో చాలా మందికి ఈ సంస్థ సాయం చేస్తోంది.

2015లో ఒక రోగితో మాట్లాడుతున్నప్పుడు ఈ ''స్మోకింగ్ ఏస్ పనిష్మెంట్’’ ఐడియా వచ్చిందని జాక్వెలిన్ చెప్పారు.

''ఆ రోగి నా కళ్లలోకి చూస్తూ ఇలా అన్నాడు. డాక్టర్.. మీరు మందుల పేరుతో చాలా డబ్బులు ఖర్చుపెట్టించారు, నాకు సిగరెట్‌పై ఇష్టం పోయేలా చేస్తానన్నారు, కానీ అలా ఏమీ జరగలేదు అని చెప్పాడు’’అని ఆనాటి ఘటనను జాక్వెలిన్‌ గుర్తు చేసుకున్నారు.

సిగరెట్

''అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది. వెంటనే ఆయనవైపు తిరిగి, మీరు ఈ సారి సిగరెట్ కాల్చేటప్పుడు.. గోడవైపు తిరిగి, నిలబడి సిగరెట్ కాల్చండని చెప్పాను’’అని ఆమె వివరించారు.

గత ఏడాది ఈ ఐడియాపై సైంటిఫిక్ జర్నల్‌లో ఒక అధ్యయనం కూడా ప్రచురితమైంది. సవ్‌పాలో ఫెడరల్ యూనివర్సిటీ, యూఎస్‌పీ, నార్వేలోని ఓస్లో యూనివర్సిటీ హాస్పిటల్ సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి.

ధూమపానం అలవాటు మానేసేందుకు రోగులు తీసుకునే సాధారణ చికిత్స(ఔషధాలు, కౌన్సెలింగ్)లను ''స్మోకింగ్ ఏస్ పనిష్మెంట్’’ విధానంతో దీనిలో పోల్చారు.

ఈ రెండు విధానాలను రెండు వర్గాల రోగులకు అనుసరించాలని సూచించారు. 12 నెలల తర్వాత నిర్వహించిన పరీక్షల్లో సాధారణ చికిత్సలను అనుసరించిన వారిలో 34 శాతం ధూమపానాన్ని మానేసినట్లు తేలింది.

అయితే, ''స్మోకింగ్ ఏస్ పనిష్మెంట్’’ విధానాన్ని అనుసరించి వారిలో సిగరెట్లు మానేసిన వారు 65 శాతం వరకు ఉన్నారు. అంటే సాధారణ ఔషధాలు తీసుకునేవారి కంటే ఇక్కడ సక్సెస్ రేటు 31 శాతం ఎక్కువగా ఉంది.

ఈ టెక్నిక్ ఎలా పనిచేస్తుంది? ఇతర చికిత్సా విధానాలతోపాటు మెరుగైన ఫలితాల కోసం దీన్ని ఎలా ఉపయోగించాలి?

సిగరెట్

అలవాటు ఎందుకు?

ధూమపానాన్ని మాన్పించే సాధారణ చికిత్సల్లో ఎక్కువగా ''వెరెనిక్లైన్’’గా పిలిచే ఔషధాన్ని ఉపయోగిస్తుంటారని జాక్వెలిన్ వివరించారు.

మెదడులోని నికోటిన్ రిసెప్టర్లపై ఈ ఔషధం ప్రభావం చూపుతుంది. ధూమపానాన్ని మానేసేటప్పుడు రోగుల మెదడులో వచ్చే ప్రతికూల స్పందనలను అడ్డుకోవడానికి ఇది సాయం చేస్తుంది.

పొగాకులో నికోటిన్ ఎక్కువగా ఉండే సంగతి తెలిసిందే. పోగాకు తాగినప్పుడు ఈ రసాయనం ఒకరమైన సంతోషానికి కారణం అవుతుంది. అయితే, క్రమంగా దీనిపై మనం పూర్తిగా ఆధారపడిపోతాం. అందుకే సిగరెట్లను వదిలించుకోవడం చాలా కష్టం.

పొగాకుల్లోని నికోటిన్.. మన మెదడులోని రిసెప్టర్లతో అనుసంధానం అవుతుంది. సిగరెట్ కాల్చే ప్రతిసారీ ఇది మనలో ఒక రకమైన సంతోషానికి కారణం అవుతుంది. అయితే, దీన్ని తగ్గించడంలో వెరెనిక్లైన్ తోడ్పడుతుంది. ఈ ఔషధాన్ని తీసుకునేటప్పుడు.. సిగరెట్ తాగడంతో వచ్చే హాయి క్రమంగా తగ్గుతుంది.

అయితే, కొంతమంది రోగులు వెరెనిక్లైన్‌కు స్పందించరు. అలాంటప్పుడు యాంటీడిప్రెసెంట్లు, నికోటిన్ ప్యాచ్‌లను వైద్యులు సిఫార్సు చేస్తుంటారు.

ఔషధాలతోపాటు కౌన్సెలింగ్ సెషన్లను కూడా రోగులకు వైద్యులు సూచిస్తుంటారు. ఎప్పుడు, ఎలా సిగరెట్ మానేయాలి? అని దీనిలో సూచనలు ఇస్తారు.

సిగరెట్

ఎందుకు పనిచేయవు?

కొన్నిసార్లు ఔషధాలతో మెదడులోని నికోటిన్ రిసెప్టర్లను కట్టడి చేసినప్పటికీ, కొందరికి సిగరెట్లు మానడం కష్టం అవుతుంది. దీనికి ముఖ్యంగా సిగరెట్ల నుంచి వచ్చే ఆనందమే కారణం.

''ముఖ్యంగా సిగరెట్‌తో వచ్చే ఆనందానికి మెదడులోని సంతోషాన్ని పెంచే భాగాలతో సంబంధముంటుంది. ప్రస్తుతం ఏ ఔషధాలు దీనిపై దృష్టిసారించడం లేదు’’అని జాక్వెలిన్ చెప్పారు.

''కొందరికి సిగరెట్ తాగడమంటే ఒక సంతోషకరమైన పని. నికోటిన్ రిసెప్టెర్లను బ్లాక్ చేసినప్పటికీ వారు సిగరెట్‌ను ఆస్వాదించగలగుతుంటారు’’అని ఆమె వివరించారు.

మరో విధంగా చెప్పాలంటే బాగా పనిచేసి అలసిపోయినప్పుడు, స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు, కాఫీ తాగుతున్నప్పుడు, భోజనం చేసిన తర్వాత ఇలాంటి మంచి సందర్భాల్లో వారు సిగరెట్ తాగడం ద్వారా తమ సంతోషాన్ని మరింత పెంచుకోవాలని చూస్తారు.

''అప్పుడే 'స్మోకింగ్ ఏస్ పనిష్మెంట్’అనే ఐడియా చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎవరూ చూడకుండా గోడవైపు తిరిగి నిలబడి సిగరెట్ తాగితే, ఆ సంతోషం నెమ్మదిగా తగ్గిపోతుంది. ఏదో తప్పు చేస్తున్నామనే భావన మనలో కలుగుతుంది’’అని జాక్వెలిన్ వివరించారు.

మందులు, కౌన్సెలింగ్‌తోపాటు ఈ విధానాన్ని పాటిస్తే, ఫలితాలు మెరుగ్గా ఉంటాయని ఆమె సూచిస్తున్నారు.

సిగరెట్

అధ్యయనం ఎలా సాగింది?

''స్మోకింగ్ ఏస్ పనిష్మెంట్’’ టెక్నిక్‌ను పరీక్షించేందుకు తమ క్లినిక్‌కు వచ్చిన రోగుల సమాచారాన్ని జాక్వెలిన్, మరికొందరు వైద్యులు పరిశీలించారు.

రోగులను రెండు వర్గాలు విభజించారు. మొదటి వర్గంలో 324 మంది రోగులు ఉన్నారు. వీరికి ఔషధాలతోపాటు ధూమపానం అలవాటు మాన్పించేందుకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు.

రెండో వర్గంలో 281 మంది రోగులు ఉన్నారు. వీరికి వెరెనిక్లైన్‌తోపాటు ఇతర ఔషధాలను కూడా ఇచ్చారు. అయితే, ఒక్కసారిగా సిగరెట్లు మానొద్దని సూచించారు. కావాల్సినన్ని సిగరెట్లు తాగొచ్చని, కానీ, ''స్మోకింగ్ ఏస్ పనిష్మెంట్’’ విధానంలో తాగాలని చెప్పారు.

మూడు నెలల తర్వాత మొదటి గ్రూపులో 45 శాతం మంది సిగరెట్లను మానేస్తే, రెండో గ్రూపులో ఈ సంఖ్య 75 శాతం వరకూ ఉంది.

ఏడాది తర్వాత మళ్లీ వారిని ప్రశ్నించినప్పుడు మొదటి గ్రూప్‌లో 34 శాతం మంది, రెండో గ్రూపులో 65 శాతం మంది సిగరెట్లను తాగడం లేదని వెల్లడించారు.

సిగరెట్ల సంఖ్య కూడా..

మరోవైపు సిగరెట్ల సంఖ్యను కూడా తగ్గించడంలో ఈ టెక్నిక్ ఉపయోగపడుతుందని మరో అధ్యయనంలో తేలింది. అయితే, ఈ అధ్యయన ఫలితాలు ఇంకా ప్రచురించలేదు.

ఈ టెక్నిక్ ఫలితాలను ధ్రువీకరించేందుకు మరింత లోతైన పరిశోధనలు అవసరమని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

''స్మోకింగ్ ఏస్ పనిష్మెంట్ టెక్నిక్ గురించి మాట్లాడేటప్పుడు.. అసలు ఇది పనిచేస్తుందా? అని చాలా మంది రోగులు సందేహాలు వ్యక్తంచేసేవారు’’అని జాక్వెలిన్ చెప్పారు.

''మేం ధూమపానం చేసేవారిని స్వేచ్ఛగా ఈ అలవాటు మాన్పించాలని అనుకుంటున్నాం. ఒకేసారి సిగరెట్లు మానేయడం చాలా కష్టం’’అని ఆమె చెప్పారు.

''ధూమపానం అనేది ఒక ఎగతెగని వ్యాధి. ఈ అలవాటు నుంచి తప్పించుకోవడానికి సరైన ప్రోటోకాల్స్‌ను పాలించాలని’’అని ఆమె వివరించారు.

''చాలా మంది తమ సంకల్ప బలంతో ఈ అలవాటును ఒకేసారి జయించొచ్చని అనుకుంటారు. కానీ అది చాలా కష్టం’’అని ఆమె అన్నారు.

''నిజమే సంకల్పం, స్ఫూర్తి ముఖ్యమే. కానీ, ఇక్కడ చాలా ప్రభావాలు మనపై ఉంటాయి. ఈ సమస్య మరిన్ని అనారోగ్య సమస్యలకు దారితీయకూడదు’’అని జాక్వెలిన్ అన్నారు.

ఏటా పొగాకు వల్ల 80 లక్షల మంది మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసింది.

15 రకాల భిన్న క్యాన్సర్లు, పక్షవాతం, ఊపిరితిత్తుల సమస్యలు, క్షయ, శ్వాసకోశ సమస్యలు, కడుపు నొప్పి, కడుపులో పుండ్లు, లైంగిక సమస్యలకు పొగాకు కారణం అవుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Smoking Punishment: What technique.. Can you quit cigarettes if you do this?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X