వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి స్మృతి ఇరానీకి మళ్లీ చిక్కులు.. ఫేక్‌ డిగ్రీ కేస్‌ పీఛే ముడ్!

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలకు సంబంధించిన కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. కిందిస్థాయి కోర్టులో ఆమెకు ఉపశమనం లభించినా ఢిల్లీ హైకోర్టులో మాత్రం మరోసారి ఈ కేసు విచారణ మొదలైంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలకు సంబంధించిన కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. కిందిస్థాయి కోర్టులో ఆమెకు ఉపశమనం లభించినా ఢిల్లీ హైకోర్టులో మాత్రం మరోసారి ఈ కేసు విచారణ మొదలైంది.

ఆమె విద్యార్హతలకు సంబంధించిన పత్రాలన్నీ సమర్పించాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది. వాటిని పరిశీలించిన తర్వాతే ఎవరికి సమన్లు పంపాలనే విషయం నిర్ణయిస్తామని తెలిపింది.

Smriti Irani Fake Degree Row Back? High Court Asks For Records

ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో తాను డిగ్రీ పూర్తి చేసినట్లు స్మృతి ఇరానీ పేర్కొన్నారని, వాస్తవానికి ఆమె డిగ్రీ పూర్తి చేయలేదని అహ్మద్‌ ఖాన్‌ అనే వ్యక్తి కిందిస్థాయి కోర్టులో ఫిటిషన్‌ దాఖలు చేశారు.

స్మృతి ఇరానీ కరస్పాండెన్స్‌ కోర్సు ద్వారా బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఉన్నారని, అది పూర్తి చేయలేదని, కానీ పూర్తి చేసినట్లుగా ఆమె ఎన్నికల కమిషన్‌కు తప్పుడు వివరాలు ఇచ్చారని, ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరగా కోర్టు తోసిపుచ్చింది.

దీంతో అహ్మద్‌ ఖాన్‌ హైకోర్టుకు వెళ్లగా విచారణకు స్వీకరించిన హైకోర్టు స్మృతి ఇరానీ విద్యార్హతలకు సంబంధించిన రికార్డులు ఇవ్వాలంటూ ఆదేశించింది.

English summary
A case against union Textiles Minister Smriti Irani accusing her of misrepresenting her education qualifications may not be over yet. The Delhi High Court has today asked for all records on the case to be handed to it. A lower court in Delhi had last year dismissed the case, filed by a man called Ahmed Khan, observing that it was meant to "needlessly harass her." Mr Khan has challenged that verdict in the High Court. He has accused Ms Irani, 41, of claiming to be a graduate in her election papers though she did not apparently finish her Bachelor of Commerce course being pursued by correspondence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X