అది ఇల్లా? పాముల పుట్టా? కోడిగుడ్లను పొదిగినట్టు..! మురిసిపోయిన యజమాని
బెంగళూరు: ఎవరి ఇంట్లోనైనా కోడి గుడ్లను పొదుగుతుంది. అది కామన్. ఓ వ్యక్తి ఇంట్లో కోడి గుడ్లను పొదిగినట్లు పాముల గుడ్లు పొదిగాచి. అయిదు కాదు పదీ కాదు! ఏకంగా 16 గుడ్లు. వాటిని పగులగొట్టుకుని జరజరా పాక్కుంటూ పాము పిల్లలు బయటికొచ్చేశాయి. వాటిని చూసి మురిసిపోయాడు ఆ ఇంటి యజమాని. వాటితో కాస్సేపు ఆడుకున్నాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగర శివార్లలోని నెలమంగళలో చోటు చేసుకుంది.
ఆ ఇంటి యజమాని పేరు లోకేష్. అందరూ ఆయనను స్నేక్ లోకేష్‌గా పిలుస్తారు. ఆయన వృత్తి వ్యాపారం. ప్రవృత్తి పాములు పట్టడం. ఎవరి ఇంట్లోనైనా పాములు కనిపిస్తే లోకేష్‌కు ఫోన్ చేస్తారు. ఆయన వెళ్లి, వాటిని పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో వదిలేస్తుంటారు. ఇలా- మూడునెలల కిందట హేసరఘట్టలోని ఓ ఇంట్లో పాము గుడ్లను సేకరించాడు. వాటిని భద్రంగా ఇంటికి తీసుకొచ్చాడు. ఓ ప్లాస్టిక్ బాక్స్‌లో పెట్టి, అంతే జాగ్రత్తగా వాటిని కాపాడుకున్నాడు.


సాధారణంగా మార్చిలో పాములు గుడ్లు పెడుతుంటాయని లోకేష్ చెబుతున్నాడు. హేసరఘట్టలోని తన స్నేహితుడు నారాయణ ఇంట్లో ఓ నాగుపాము గుడ్లు పెట్టిందని, ఈ విషయాన్ని అతను తనకు తెలియజేయగా.. వాటిని తన వెంట తెచ్చుకున్నానని చెబుతున్నాడు స్నేక్ లోకేష్. ఈ మూడు నెలల పాటు వాటిని జాగ్రత్తగా చూసుకున్నానని, ఇప్పుడవి పగిలి పాము పిల్లలు బయటికొచ్చాయని చెబుతున్నాడు. వాటిని పెంచుకుంటానని లోకేష్ కరాఖండిగా చెబుతుండటం ట్విస్ట్. ఈ పాము పిల్లలు జరజరా పాక్కుంటూ తిరుగుతున్న దృశ్యాలను ఆయన వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications