ఇండియాపై చులకన వ్యాఖ్యలు: మనవాళ్లు ‘స్నాప్‌చాట్’ను చీల్చి చెండాడారు!

Subscribe to Oneindia Telugu

న్యూయార్క్‌: భారతీయులపై చులనకగా మాట్లాడిన స్నాప్‌చాట్‌కు మనవాళ్లు ఇచ్చిన సమాధానంతో దిమ్మదిరిగి మైండ్ బ్లాకయింది. మరోసారి భారతీయులు పెట్టుకోవద్దనేలా మనవాళ్లు దుమ్మురేపారు. దీంతో కాళ్ల బేరానికి సిద్ధమైంది స్నాప్‌చాట్ యాజమాన్యం. మొన్న సీఈవో స్పైగల్‌ను వెనకేసుకువచ్చిన ఆ సంస్థ ఇప్పుడు నెమ్మదిగా మాటమార్చేసింది. స్నాప్‌చాట్‌ అందరి కోసం ఉద్దేశించిందని.. భారతీయులకు ఎంతో రుణపడి ఉన్నామని చెప్పకొచ్చింది.

కేవలం రోజుల్లోనే స్నాప్‌చాట్‌ రేటింగ్‌ గణనీయంగా పడిపోవడంతో ఆ సంస్థ నష్టనివారణ చర్యలకు రంగంలోకి దిగింది. మంగళవారం స్నాప్‌ ఛాట్‌ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ ' తమ యాప్‌ అందరిదీ అని.. ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మా మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణలను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించం.. భారత్‌లో, ప్రపంచ వ్యాప్తంగా స్నాప్‌చాట్‌ వినియోగదారులకు ధన్యవాదాలు. ' అని వ్యాఖ్యానించారు.

Snapchat shares drop following CEO's alleged "India too poor" comment

గొడవేంటంటే..

2015లో స్నాప్‌చాట్‌ ఓ అంతర్గత సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో వినియోగదారుల ఆధారంగా అభివృద్ధిపై దృష్టిపెట్టింది. ఈ సందర్భంగా నాటి స్నాప్‌చాట్‌ ఉద్యోగి భారత్‌, స్పెయిన్‌ వంటిదేశాల్లో అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించాడు. కానీ దీనికి స్పైగల్‌ స్పందిస్తూ.. 'స్నాప్‌చాట్‌ భారత్‌, స్పెయిన్‌ వంటి పేదదేశాల కోసం కాదు. ప్రీమియం కస్టమర్లపై దృష్టిపెట్టాలి' అని అన్నారు. ఈ విషయాన్ని వెరైటీ మీడియా అనే సంస్థ బహిర్గతం చేసింది. వివాదం రేగినప్పుడు తొలుత స్నాప్‌చాట్‌ సీఈవో ఇవాన్‌ స్పైగల్‌ను వెనకేసుకొచ్చింది. కానీ ఈ వివాదం ముదరడంతో ఇప్పుడు భారతీయులకు కృతజ్ఞతలు అంటూ మాట మార్చేసింది.

కాగా, భారత్‌పై స్నాప్‌చాట్‌ సీఈవో స్పైగల్‌ చేసిన వాఖ్యలను భారతీయులు తీవ్రంగా పరిగణించారు. దీని ఫలితంగా స్నాప్‌చాట్‌ రేటింగ్‌ రోజురోజుకూ కుంగిపోతోంది. మరో పక్క వేలసంఖ్యలో ఈ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు. ప్లేస్టోర్‌లోని రివ్యూల్లో భారతీయులు స్పైగల్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఇటీవల పోస్టు అయి ప్లేస్టోర్‌లో రివ్యూల్లో చాలావరకు స్పైగల్‌ను తప్పుపడుతూ.. సింగిల్‌ స్టార్‌ రేటింగ్‌ ఇచ్చినవే ఉంటున్నాయి. వీటి ప్రభావం కొత్త డౌన్‌లోడ్లపై కూడా చూపుతోంది. ఆదివారం సాయంత్రానికి 1,92,906 ఉన్న సింగిల్‌ స్టార్‌ రేటింగ్‌లు.. మంగళవారం ఉదయానికి 15,02,203కు చేరాయి. ఇవి 4స్టార్‌ రేటింగ్‌కు దాదాపు సమానం.

కుప్పకూలిన షేర్లు

భారత్‌, స్పెయిన్‌పై స్నాప్‌చాట్‌ సీఈవో స్పైగల్‌ వాఖ్యలతో యాప్‌ రేటింగ్‌ పడిపోతుండటంతో స్నాప్‌ ఐఎన్‌సీ షేర్లు అమెరికా మార్కెట్లలో కుంగుతున్నాయి. ఒక్క సోమవారమే ఈ షేర్‌విలువ 1.5శాతం పడిపోయింది. ఏప్రిల్ నెలలో ఇదే అతి తక్కువ విలువ కావడం గమనార్హం. సంస్థ త్వరలో 3.4 బిలియన్‌ డాలర్లు విలువైన పబ్లిక్‌ లిస్టింగ్‌కు రావాలని భావించింది. కానీ, ప్రస్తుత పరిణామాలతో దాని ఆశలపై నీళ్లు జల్లినట్లైంది. ట్విట్టర్‌లో ఏకంగా బాయ్‌కాట్‌ స్నాప్‌చాట్‌ హ్యాష్‌ట్యాగ్‌ను పెట్టి మరీ ఆ సంస్థ తాటతీస్తున్నారు. దీంతో స్నాప్ చాట్ సంస్థ పరువు మరింత దిగజారే అవకాశం లేకపోలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Shares of Snap fell 1.5 percent on Monday as the Snapchat owner faced criticism for comments allegedly made by its CEO about not prioritizing growth in India and Spain because they were "poor" countries.
Please Wait while comments are loading...