స్నాప్‌డీల్ బంపర్ ఆఫర్: స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.అమెజాన్,, ఫ్లిప్‌కార్ట్‌ల తరహలోనే స్నాప్‌డీల్ ఆఫర్లు ప్రకటించాయి.అయితే అక్టోబర్ 13వ, తేది నుండి స్నాప్‌డీల్ బంపర్ ఆఫర్లను ప్రకటించింది.

దీపావళి పండుగ సీజన్‌‌ను క్యాష్‌ చేసుకునేందుకు అన్‌బాక్స్‌ దివాలి సేల్‌ను స్నాప్‌డీల్ అక్టోబర్ 13వ, తేదిన ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్లు వంటి ఎలక్ట్రానిక్స్‌పై బంపర్‌ ఆఫర్లను అందిస్తోంది. పలు బ్యాంకు కార్డులపై కూడా ఫ్లాట్‌ డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌లను స్నాప్‌డీల్‌ ప్రవేశపెట్టింది. వీటితో పాటు ఈ సేల్‌లో భాగంగా ధమాకా డీల్స్‌ను కూడా స్నాప్‌డీల్‌ ఆఫర్‌ చేస్తోంది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బంఫర్ ఆఫర్లు: మొబైల్స్, టీవీలపై క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు

సిటీ క్రెడిట్‌ కార్డును వాడి కనీసం రూ.2000 మేర కొనుగోలు చేస్తే 15 శాతం క్యాష్‌బ్యాక్‌ నుంచి రూ.2000 ఆఫర్ ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు హోల్డర్స్‌కు 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను అందిస్తోంది. తొలిరోజు సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డు దారులకు అదనంగా 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. అక్టోబర్ 14న, స్టాండర్డ్‌ ఛార్టడ్‌ కార్డు యూజర్లకు ఆఫర్లను స్నాప్‌డీల్‌ ప్రకటించింది.

Snapdeal Unbox Diwali Sale Offers: Smartphones, Laptops, External Hard Drives, and Other Deals

మెుబైల్స్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్లను ప్రకటించింది. వివో వీ5 ప్లస్‌ 64జీబీ గోల్డ్‌ కలర్‌ వేరియంట్‌పై 28 శాతం డిస్కౌంట్‌‌ను ప్రకటించింది. ఒకవేళ ఏదైనా బ్యాంకు కార్డు ఆఫర్‌ ఉంటే మరో రూ.2000 క్యాష్‌బ్యాక్‌‌ను ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

వివో వీ5ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ రూ.15,799కు, జియోని ఏ1 రూ.15,348కి, మోటో ఎం రూ.14,999కు, మోటో జీ5ఎస్‌ రూ.14,295కు అందుబాటులో ఉన్నాయి.సోనీ ఎండీఆర్‌-జెడ్‌ఎక్స్‌110ఏ హెడ్‌ఫోన్లపై 53 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది స్నాప్‌డీల్.

లెనోవో ఐడియాప్యాడ్‌ 80ఎక్స్‌హెచ్‌01జీఈఐఎన్‌ నోట్‌బుక్‌పై 21 శాతం డిస్కౌంట్‌‌ను ప్రకటించింది. దీంతో రూ. 26,499 లకే విక్రయించనుంది. పలు పీసీ, ల్యాప్‌టాప్‌ మోడల్స్‌ ఈ సేల్‌లో డిస్కౌంట్‌ ధరలకే అందుబాటులో ఉన్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Snapdeal has ahead of Diwali announced its festival season sale, called the Unbox Diwali Sale. It takes on Flipkart's Big Diwali Sale and Amazon India's Great Indian Festival Sale. The Snapdeal Unbox Diwali Sale has started from Friday, October 13, and will end on Monday, October 16.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి