ఢిల్లీ ఎన్నికలు: ప్రచారానికి సోషల్ మీడియా సైతం... ఆప్ నేతపై దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీల రోడ్ షోలు గురువారంతో ముగిశాయి. దీంతో పార్టీలు ఆన్‌లైన్ ప్రచారాని తెరదీశాయి. సోషల్ మీడియాలో ఆమ్ ఆద్మీ, బీజేపీ పార్టీలు పోటా పోటీగా తమ పార్టీకే ఓటేయండంటూ ప్రచారం సాగిస్తున్నాయి.
హ్యాస్ ట్యాగులతో ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్‌ను హీరోగా చూపించి ప్రచారం చేస్తుంటే, బీజేపీ మాత్రం పీఎం మోడీ సీఎం బేడీ అంటూ అదరగొడుతుంది. ఫిబ్రవరి 7న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేలు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకే సీఎం పీఠం అంటూ చెబుతుంటే, బీజేపీ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా తన వంతు ప్రచారాన్ని చేస్తుంది.

ఆప్ నేత అఖిలేశ్‌పతి త్రిపాఠిపై దాడి
ఆమ్ ఆద్మీ పార్టీ నేత అఖిలేశ్‌పతి త్రిపాఠిపై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం దాడి చేశారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. త్రిపాఠి ఢిల్లీలోని మోడల్ టౌన్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆప్ నేతలపై బీజేపీ దాడులు చేయిస్తుందని ఆప్ ఆరోపించిన విషయం తెలిసిందే.
ఢిల్లీ పోలీసులు బీజేపీ ఒత్తిడితో పనిచేస్తున్నారు: కేజ్రీవాల్
ఢిల్లీ పోలీసులు బేజీపే ఒత్తిడితో పనిచేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఒత్తడితో తమ అభ్యర్ధులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఉత్తమనగర్ నియోజక వర్గ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ది వద్ద మద్యం సీసాలు లభించడం వెనుక బీజేపీ కుట్ర దాగుందని చెప్పారు.
తమ ప్రభుత్వం సాధించిన విజయాలను పేర్కొంటూ బేజీపీకే ఓటు వేయాలంటూ ఆ పార్టీ శుక్రవారం వచ్చిన వార్తా పత్రికల మొదటి పేజీలో ప్రకటనలు ఇచ్చింది. ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తర్వాత ఇలాంటి ప్రకటనలు చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంమే అవుతుందని ఆప్ నేతలు విమర్శించారు.
ఫిబ్రవరి 7న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10న ఫలితాలు వెల్లడించనున్నారు.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications