అదీ చీఫ్ పబ్లిషిటీ : డైవర్స్‌పై బిప్లవ్ భార్య నితి
అగర్తలా : త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయనే ప్రచారానికి ఆయన సతీమణి నితి దేవ్ చెక్ పెట్టారు. కొందరు పనిగట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భార్యను బిప్లవ్ దేవ్ వేధిస్తున్నారని, గృహహింసకు పాల్పడ్డారని .. ఈ నేపథ్యంలోనే నితి ఆయనకు విడాకులు ఇస్తున్నారని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. దీనిపై నితి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ .. అవన్నీ పుకార్లేనని తోసిపుచ్చారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఆమె పోస్టు పెట్టారు.

చీఫ్ పబ్లిసిటీ
'నీచ బుద్ధి కలిగిన కొందరు, చీఫ్ పబ్లిసిటీ కోసం ఇలాంటివి ప్రచారం చేస్తారు. బిప్లవ్ ను చెడుగా చూపించి రాజకీయంగా లబ్ది పొందాలని భావించిన వాళ్లే డబ్బులు ఇస్తూ మరీ దుష్ప్రచారం చేస్తున్నారు. నేను భార్యగా, కోడలిగా బాధ్యతలు నెరవేరుస్తున్నానని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలకు నిజంగా ప్రేమానురాగాలు ఉంటే .. నన్నుపూర్తిగా విశ్వసించినట్లైతే అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిని వదంతులను నమ్మొద్దు' అని నితి స్పష్టంచేశారు.
నోటిదురుసు
భార్య భర్తల మధ్య బంధం ఇలా ఉంటే ... ఇదివరకు బిప్లవ్ నోటిదురుసుతో వార్తల్లో నిలిచారు. మహాభారత కాలంలో శాటిలైట్ కమ్యునికేషన్ ఉందని .. మొదలైన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు ఇటీవల చదువుకోవడం కన్నా పాన్ షాపు పెట్టుకోవడం మిన్న అనే వరకు కొనసాగింది. ఈ క్రమంలోనే భార్యభర్తల మధ్య సఖ్యత లేదనే ప్రచారం నేపథ్యంలో .. నితి స్పందించారు.












Click it and Unblock the Notifications