Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆంటీ కూతురితో లవ్ మ్యారేజ్, ఎస్కేప్, అర్దరాత్రి అత్త ఇంట్లోకి వెళ్లిన అల్లుడు ఏం చేశాడంటే ?

వయసుకు వచ్చిన కూతుర్లతో ఆమె తల్లి నివాసం ఉంటున్నది. ఆర్థికంగా శ్రీమంతులు అయిన తల్లీకూతుర్లు సంతోషంగా ఉండేవాళ్లు. ఇదే సమయంలో చిన్న కూతురు ఓ యువకుడి ప్రేమలో పడింది. కొంతకాలం తరువాత ప్రియుడితో కలిసి ఆ యువతి పారిపోయింది. తన కూతురు కనపడటం లేదని తల్లి కేసు పెట్టి ఏడాదికిపైగా అయ్యింది. అయితే ఇంత వరకు కూతురు ఎక్కడ ఉందో ఆ తల్లికి తెలీదు. 18 నెలల తరువాత అర్దరాత్రి అల్లుడు ఒంటరిగా అతని భార్య పుట్టింటిలో అడుగుపెట్టాడు. అత్త ఇంట్లో ఎంట్రీ ఇచ్చి అల్లుడు ఏం చేశాడంటే ?.

బెంగళూరు సిటీలోని హలసూరులో రెజినా అనే మహిళ నివాసం ఉంటున్నది. రెజీనాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పెళ్లి చేసుకుని ఆమె భర్త ఇంటిలో ఉంటోంది. రెజీనా రెండో కుమార్తె పేరు లావణ్య. రెజీనా, ఆమె కుమార్తె లావణ్య ఒకే ఇంటిలో నివాసం ఉండేవాళ్లు. మూడు సంవత్సరాల క్రితం ప్రదీప్ కుమార్ అనే యువకుడు లావణ్యకు పరిచయం అయ్యాడు. కొంతకాలం ఇద్దరూ ఫ్రెండ్స్ గా ఉన్నారు.

Son-in-law stole gold jewelery and cash worth Rs 40 lakh from aunts house

రానురాను లావణ్య, ప్రదీప్ కుమార్ ప్రేమలోపడ్డారు. రెజీనాకు సొంత ఇంటితో పాటు డబ్బు, బంగారు ఎక్కువగానే ఉంది. కుతుర్లకు ఏం కావాలన్నా ఇస్తున్న రెజీనా కూతుర్లు తనకు సర్వస్వం అనుకుంది. అయితే 18 నెలల క్రితం మంచిరోజు చూసుకున్న లావణ్య ఆమె ప్రియుడు ప్రదీప్ తో కలిసి పారిపోయింది. చిన్నకూతురు లావణ్య కోసం చాలా చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో విసిగిపోయిన రెజీనా నా కుమార్తె కనపడటం లేదని బెంగళూరులోని హలసూరు పోలీస్ స్టేషన్ లో 18 నెలల క్రితం ఫిర్యాదు చేసింది.

అయితే రెజీనాకు ఆమె కుమార్తె లావణ్య ఎక్కడ ఉంది అనే విషయం మాత్రం ఇంత వరకు తెలీదు. లావణ్య ఆమె తల్లి రెజీనా కంటపడకుండా ప్రదీప్ అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇటీవల రెజీనా తమిళనాడులోని కన్యాకుమారిలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. చాలా రోజుల నుంచి రెజీనా కన్యాకుమారిలోనే ఉంది. లావణ్య భర్త ప్రదీప్ హలసూరులోని అతని అత్త రెజీనా ఇంటి దగ్గర ప్రత్యక్షం అయ్యాడు.

అత్త రెజీనా ఇంటి తాళం చాకచక్యంగా తీసిన ప్రదీప్ ఇంట్లోకి వెళ్లాడు. తరువాత అత్త రెజీనా ఇంట్లో ఉన్న బంగారు నగలు, నగదు, విలువైన వస్తులు మొత్తం లూటీ చేశాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో రెజీనా ఇంటి చుట్టుపక్కల నివాసం ఉంటున్నవాళ్లు ఎవరు నువ్వు అని ప్రదీప్ ను ప్రశ్నించారు. తాను రెజీనా అక్క కుమారుడు అని, ఆమె ఊరికి వెలుతూ తనను అప్పుడప్పుడు ఇంటికి వెళ్లి పరిశీలించాలని చెప్పిందని ప్రదీప్ అక్కడ ఉన్నవాళ్లకు చెప్పాడు.

Son-in-law stole gold jewelery and cash worth Rs 40 lakh from aunts house

అయితే స్థానికులకు అనుమానం వచ్చి కొందరు ప్రదీప్ ఫోటోలను మొబైల్ లో తీశారు. వెంటనే కన్యాకుమారిలో ఉన్న రెజీనా ఫోన్ నెంబర్ కు ఫోన్ చేశారు. అయితే రెజీనా ఫోన్ నెంబర్ నాట్ రీచబుల్ అని రావడంతో స్థానికులు సైలెంట్ గా ఉండిపోయారు. ఆ సందర్బంలో ప్రదీప్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన రెజీనా ఇంటి తలుపు తాళం పగలగొట్టిన విషయం గమనించింది.

ఇంటిలోపలికి వెళ్లిన రెజీనా బీరువా చూసి షాక్ అయ్యింది. బీరువాలో ఉన్న బంగారు నగలు, వెండివస్తువులు, ఇంటిలో ఉన్న పట్టుచీరలు చోరీ అయ్యాయని గమనించి కేకలు వేసింది. చుట్టుపక్కల వాళ్లు వెళ్లి విషయం తెలుసుకున్నారు. మీ ఇంటికి మీ బంధువు అని ఓ యువకుడు వచ్చి వెళ్లాడని, అతని ఫోటో కూడా మేము తీశామని చెప్పారు. పక్కింటి వాళ్ల మొబైల్ ఫోన్ లో ఉన్న ఫోటో చూసిన రెజీనా షాక్ కు గురైయ్యింది.

ఫోటోలు చూసిన రెజీనా వీడు నా బంధువు కాదు, నా చిన్నకూతురు లావణ్య భర్త ప్రదీప్ అని చెప్పడంతో స్ధానికులు హడలిపోయారు. తన అల్లుడు ప్రదీప్ తన ఇంట్లో రూ. 40 లక్షల విలువైన బంగారు నగలు, నగదు, వెండివస్తులు చోరీ చేశాడని రెజీనా కేసు పెట్టడంతో పోలీసులు షాక్ అయ్యారు. రెజీనా ఇంట్లో చాకచక్యంగా చోరీ చేసిన ఆమె కిలాడీ అల్లుడు ప్రదీప్ కుమార్ అలియాస్ ప్రదీప్ కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+