వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్-ఎస్పీ కూటమికి బిగ్ షాక్: సోనియా కూడా ప్రచారానికి దూరం..

సోనియా యూపీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండబోతున్నారంటూ ఆ పార్టీ వర్గాలు మంగళవారం నాడు సంకేతాలు పంపించాయి.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పొత్తుతో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో జయభేరీ మోగించాలనుకున్న కాంగ్రెస్-సమాజ్ వాదీ
(ఎస్పీ) కూటమికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. సమాజ్ వాదీ పెద్ద దిక్కు ములాయం సింగ్.. ఇప్పటికే ప్రచారానికి వచ్చేది లేదని తేల్చి చెప్పగా.. తాజాగా తానూ ప్రచారానికి దూరమే అన్న సంకేతాలు ఇస్తున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.

సోనియా యూపీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండబోతున్నారంటూ ఆ పార్టీ వర్గాలు మంగళవారం నాడు సంకేతాలు పంపించాయి. దీంతో ఇద్దరు దిగ్గజ నేతలు ప్రచారానికి దూరంగా ఉండటం కూటమిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అనారోగ్య కారణాల వల్లే సోనియా ప్రచారం నుంచి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ.. స్పష్టమైన కారణాలేవి తెలియరాలేదు.

Sonia gandhi not to campaign in uttarpradesh

కాగా, దీనిపై ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. ఈమధ్య కాలంలో తరుచూ సోనియా గాంధీ అనారోగ్యానికి గురవుతూ వస్తున్నారు. కొద్ది నెలల క్రితమే కాంగ్రెస్ తరుపున ఓ ప్రచార ర్యాలీలో పాల్గొన్న సోనియా కొద్ది నిమిషాలకే అనారోగ్యానికి గురై ఢిల్లీ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

ఆ గెలుపుతో అందరి కన్నా 'నాన్న'కే సంతోషం:

మంగళవారం నాడు జలేసర్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన.. కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు.. కూటమి గెలిస్తే అందరికన్నా ఎక్కువగా సంతోషపడేది నాన్నే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

English summary
In a major blow to Congress party, its President Sonia Gandhi will not campaign in any of the five poll bound states, including Uttar Pradesh, sources in the party said on January 31. Notably, Sonia Gandhi has not been keeping well these days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X