సోనియా గాంధీకి అస్వస్థత: సిమ్లా నుంచి ఢిల్లీ ఆస్పత్రికి తరలింపు
సిమ్లా: యూపీఏ ఛైర్ పర్సన్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. నిర్మాణంలో ఉన్న తన సొంత ఇంటిని పరిశీలించేందుకు సోనియా గాంధీ, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా సిమ్లాకు 15కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛరబ్రా వెళ్లారు.
కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..
కాగా, గురువారం అర్ధరాత్రి సమయంలో సోనియా గాంధీ అస్వస్థతకు గురవడంతో ఆమె వెంట ఉన్న డాక్టర్ ఢిల్లీలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి ఫోన్ చేసి అంబులెన్స్ పంపమని కోరాడు.

అయితే, అంబులెన్స్ వచ్చే లోపే సోనియా తన కారులో ఆస్పత్రికి బయల్దేరారు. కొంత దూరం వెళ్లాక వైద్యుల బృందం అంబులెన్స్‌లో వచ్చి ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications