హృదయంలో బాధ నింపిన షీలా మృతి.. భావోద్వేగంతో సోనియా లేఖ
న్యూఢిల్లీ : షీలా దీక్షిత్ మృతితో యూపీఏ చైర్ పర్సన్ భావోద్వేగానికి గురయ్యారు. తన వెన్నంటే ఉన్న షీలా లేరనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. తనతో సన్నిహితంగా మెలిగిన కొందరు నేతల్లో షీలా ఒకరిని పేర్కొన్నారు. ఈ సందర్భంగా షీలా కుమారుడు, కూతురుకు సోనియా భావోద్వేగంతో లేఖ రాశారు.
సోనియా లేఖ ..
షీలా దీక్షిత్ మృతి నా హృదయంలో బాధను నింపిందని లేఖ ప్రారంభించారు సోనియా. ఆమె తనకు ప్రత్యేక బహుమతి లాంటి వారని కొనియాడారు. తనతో వ్యక్తిగతంతో సన్నిహితంగా మెలగడానికి ఇదే కారణమని విశ్లేషించారు. షీలా దీక్షిత్‌తో తనది ఎన్నో ఏళ్ల బంధం అని గుర్తుచేశారు. ఢిల్లీ సీఎంగా, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్‌గా, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ సెక్రటరీగా అద్భుతమైన సేవలను నిర్వర్తించారని కొనియాడారు. తుది శ్వాస విడిచే వరకు పార్టీ కోసం పనిచేశారని ప్రశంసించారు.

షీలా దీక్షిత్ ముందుచూపు ఉన్న నేత అని సోనియా గుర్తుచేశారు. సీఎంగా ఒక విజన్‌తో పనిచేశారని కీర్తించారు. అంత చిత్తశుద్ధితో పనిచేసినందునే ఢిల్లీ పౌరులంతా ప్రశాంతంగా జీవించారని తెలిపారు. దీనికి ఆమె ప్రవేశపెట్టిన సంస్కరణలు బలం చేకూర్చాయని గుర్తుచేశారు. షీలా దీక్షిత్ లేని లోటు తీర్చలేనిది.. ఆ దేవుడు మీకు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని' లేఖలో పర్కొన్నారు సోనియా గాంధీ.












Click it and Unblock the Notifications