ఆశ్చర్యం: ఓఎల్ఎక్స్‌ను ఇలా కూడా వినియోగిస్తున్నాడు
న్యూఢిల్లీ: వాహనాలు, ఇంట్లోని ఫర్నీచర్ ఇలాంటి వాటిని ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి చూస్తుంటాం. కానీ హర్యానాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం పశువులను ఓఎల్ఎక్స్ ద్వారా కొనడం, అమ్మడం చేస్తున్నాడు. మన ప్రాంతాల్లో పశువులను కొనాలన్నా, అమ్మాలన్నా అంగళ్లకు వెళ్లాలి.
ఇతను మాత్రం ఓఎల్ఎక్స్ ద్వారా హైటెక్ పద్ధతిలో పశువులను కొనడం, అమ్మడం చేస్తున్నాడు. సోనిపేట్‌కు చెందిన రాకేష్ ఖత్రీ అనే రైతు ఇలా చేసి మంచి లాభాలు పొందుతున్నాడు. ఇప్పటి వరకు 25 ఆవులను, బర్రెలను అమ్మి రూ. లక్ష లాభం పొందాడు. గత నాలుగు నెలల నుంచి పశువులను ఓఎల్ఎక్స్ ద్వారా అమ్ముతున్నట్లు అతను తెలిపాడు.

తన ప్రకటనను ఓఎల్‌ఎక్స్‌లో చూసి వ్యాపారులు ఇంటి వద్దకే వచ్చి పశువులను కొంటున్నారన్నాడు. దీంతో వారాంతపు సంతలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఇప్పటి వరకు వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లు మాత్రమే ఓఎల్‌ఎక్స్‌లో జరుగుతున్నాయి.
రాకేశ్ కేవలం పన్నెండో తరగతి మాత్రమే చదువుకున్నాడు. కానీ టెక్నాలజీని వినియోగించుకోవడంలో మాత్రం ముందున్నాడు. అందుకే గత నాలుగు నెలలుగా ఓఎల్‌ఎక్స్‌లో పశువులను అమ్ముతున్నాడు. ఈ క్రమంలో అశోక్, బాబు అనే ఇద్దరు వ్యాపారులు పశువులను కొనడానికి ఎన్నోచోట్ల తిరిగి తిరిగి చివరికి ఒక ప్రకటనలో చూసి రాకేశ్‌ను సంప్రదించినట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications