డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడ ఆధార్‌తో అనుసంధానం: రవిశంకర్‌ప్రసాద్
డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడ ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్టు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. డిజిటల్ హర్యానా సమ్మిట్ 2017ను శుక్రవారంనాడు మంత్రి ప్రారంభించారు.
Recommended Video

Centre Plans To Link Driving Licence To Aadhaar Card | Oneindia Telugu
న్యూఢిల్లీ: డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడ ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్టు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. డిజిటల్ హర్యానా సమ్మిట్ 2017ను శుక్రవారంనాడు మంత్రి ప్రారంభించారు.
డ్రైవింగ్ లైసెన్స్‌తో ఆధార్‌కార్డును అనుసంధానం అమలు చేయనున్నట్టు చెప్పారు. అయితే ఈ లింకింగ్‌కు ఎలాంటి గడువు లేదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు.

ఈ విషయమై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చిస్తున్నట్టు రవిశంకర్‌ప్రసాద్ ప్రకటించారు. నగదు అక్రమలావాదేవీల నిరోధానికి కూడ పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం అవసరమని చెప్పారు.
ఆధార్ అనుసంధానం చేయడం వల్ల గోప్యత ఉల్లంఘనలపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకముందే కేంద్ర మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.












Click it and Unblock the Notifications