ఇక సింగిల్ డోస్ టీకా: సర్కార్‌కు జే అండ్ జే ఆప్లై.. ఇవ్వడమే తరువాయి
కరోనాకు వ్యాక్సిన్‌తోనే చెక్ పెట్టాలి. ఇందుకోసం రెండు డోసులు టీకా తీసుకుంటున్నాం. అయితే సింగిల్ డోస్ జాన్సన్ అండ్ జాన్సన్.. కూడా దేశంలోకి రానుంది.
కరోనా వైరస్ కోసం సింగిల్ డోసు వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ శుక్రవారం దరఖాస్తు చేసుకుంది. జాన్సెన్ పేరుతో సింగిల్ డోసు వ్యాక్సిన్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఈ సంస్థ ఇండియాలో ప్రయోగాల కోసం దరఖాస్తు చేసుకొని దానిని ఉపసంహరించుకుంది.
ఇప్పటికే పలు దేశాలు అనుమతించిన ప్రముఖ వ్యాక్సిన్లను ట్రయల్స్ అవసరం లేకుండా నేరుగా అత్యవసర వినియోగానికి అనుమతించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. పాత దరఖాస్తును ఉపసంహరించుకున్న జే అండ్ జే సంస్థ.. తాజాగా అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకుంది. ఇండియా ప్రజలకు తమ సింగిల్ డోసు వ్యాక్సిన్ అందించే దిశగా ఇది చాలా ముఖ్యమైన అడుగు అని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ. లిమిటెడ్ సంస్థతో జే అండ్ జే చేతులు కలిపింది. ఇప్పటికే అమెరికాకు చెందిన మోడెర్నాకు భారత్ అనుమతించిన విషయం తెలిసిందే.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications