ఇక జోరు వానలే: ఈశాన్య రుతుపవనాలు వచ్చేశాయ్

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పూర్తిగా ముగిసింది. నాలుగు నెలల పాటు మురిపించి.. భంగపరిచిన నైరుతి వానలు ఎట్టకేలకు దేశం నుంచి శాశ్వతంగా వీడ్కోలు తీసుకున్నాయి. సాధారణంగా సెప్టెంబర్ మధ్యలో ప్రారంభమయ్యే తిరోగమన, అక్టోబర్ మధ్యనాటికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి పూర్తిగా వైదొలిగింది.

ఈ పరిణామంతో పాటు ఇప్పుడు దక్షిణ భారతదేశంపై ఈశాన్య రుతుపవనాలు తమ ప్రతాపాన్ని చూపించేందుకు రంగంలోకి దిగాయి. ఒక వాతావరణం ముగిసి మరో వాతావరణం ప్రారంభమయ్యే ఈ కీలక తరుణంలో, దక్షిణ భారతాన్ని తూర్పు గాలులు బలంగా తాకుతుండటంతో వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

నైరుతి వైదొలగడంతోనే ఖాళీ అయిన స్థానాన్ని ఈశాన్య రుతుపవనాలు భర్తీ చేస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాలకు ఈశాన్య రుతుపవనాలే ప్రధాన జీవనాధారంగా శీతాకాల వర్షాలను కురిపిస్తాయి. తాజాగా దక్షిణ తమిళనాడు తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు, తూర్పు - ఈశాన్య దిశల నుంచి వీస్తున్న బలమైన గాలుల కారణంగా ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నేడు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌తో పాటు దక్షిణ కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Southwest Monsoon Ends Across India While Northeast Monsoon Triggers Heavy Downpours In Southern States

తెలుగు రాష్ట్రాలు, కేరళలోనూ జోరుగా వానలు

కేవలం తమిళనాడు మాత్రమే కాకుండా, మన తెలుగు రాష్ట్రాలపై కూడా ఈ వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తీర కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్ ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

AP Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన- ఈ జిల్లాల్లో నాలుగు రోజుల పాటు ..!
AP Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన- ఈ జిల్లాల్లో నాలుగు రోజుల పాటు ..!

ముఖ్యంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురు గాలులు గంటకు 40 నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్ పరిధిలో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు, కొంకణ్, గోవా ప్రాంతాలలో మాత్రం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి ఉక్కబోత ఉక్కిరిబిక్కిరి చేయనుంది.

ఏ క్షణమైనా భారీ వర్షం.. ఈశాన్య రుతుపవనాల ఆగమనం
ఏ క్షణమైనా భారీ వర్షం.. ఈశాన్య రుతుపవనాల ఆగమనం

ఉత్తరాదిలోనూ అకస్మాత్తుగా మారిన వాతావరణం

దక్షిణాదిలో వానల జోరు ఇలా ఉంటే, ఉత్తర భారతదేశంలో మాత్రం పశ్చిమ కల్లోలం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే జమ్మూ కశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాలలో వర్షాలు కురిశాయి. నేడు కూడా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, చండీగఢ్, దిల్లీతో పాటు లడఖ్ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది.

ఉత్తరాఖండ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన చెదురుమదురు వానలు పడే ఛాన్స్ ఉంది. అయితే, దేశంలోని రాజస్థాన్, గుజరాత్, బీహార్ తదితర మిగతా రాష్ట్రాలన్నింటిలోనూ వాతావరణం పూర్తిగా పొడిగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+