అఖిలేష్‌కు డిమాండ్: అజమ్‌ఖాన్ వ్యాఖ్యపై బీజేపీ, ఎస్పీ వాగ్యుద్ధం
లక్నో: సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత, ఉత్తర ప్రదేశ్ మంత్రి అజమ్ ఖాన్ విషయమై భారతీయ జనతా పార్టీ, సమాజ్‌వాది పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అజమ్ ఖాన్‌ను ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన మంత్రివర్గం నుండి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ.. అజమ్ ఖాన్‌ను తీవ్రవాదిగా పేర్కొన్నందుకు కేంద్రమంత్రి సంజీవ్ బలియా పైన ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దీనిపై బీజేపీ ధీటుగా స్పందించింది. బీజేపీ ఉత్తర ప్రదేశ్ అధికార ప్రతినిధి విజయ్ బహదుర్ పాఠక్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అఖిలేష్ మొదట అజమ్ ఖాన్‌ను తన మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. బీజేపీని విమర్శించే ముందు ఎస్పీ తమ పార్టీ నేత అజమ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు.
వారి పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పుట్టిన రోజుకు తాలిబన్లు, ఎల్ఈటీ, దావూద్ ఇబ్రహీంలు ఫండ్ ఇచ్చారని అజమ్ ఖాన్ స్వయంగా చెప్పారని, వాటి మాటేమిటని ప్రశ్నించారు. అజమ్ ఖాన్ గతంలో ప్రధాని మోడీని మర్డరర్‌గా పేర్కొన్నారన్నారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మంత్రుల బెదిరింపులకు బీజేపీ భయపడదన్నారు. ప్రభుత్వం తప్పులను తాము ఎత్తి చూపుతామని చెప్పారు. బీజేపీ నేతలు అధికార దాహంతో ఉన్నారని, వారు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని ఎస్పీ నేత రాజేంద్ర చౌదరి విమర్శించారు.












Click it and Unblock the Notifications