ప్రభాస్ కన్నా అందంగా.. మహా కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా బాహుబలి బాబా!
మహా కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతుంది. జనవరి 13న మొదలైన ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు కొనసాగుతుంది. ప్రస్తుతం సాధువులు, హిందువులు మహా కుంభమేళా లో అమృత, పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. సామాన్యుల నుంచి సాధువుల వరకు మహా కుంభమేళాలో సంగమ స్నానాలు చేస్తూ ఆది దేవుడి ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. ఇక మహా కుంభమేళాలో కనిపిస్తున్న బాబాలు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నారు.
మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా బాహుబలి బాబా
మొన్నటికి మొన్న గోల్డెన్ బాబా అంతకు ముందు ఒక అందాల సాధ్వి మహాకుంభమేళాలో సందడి చేస్తే ఇప్పుడు మహా కుంభమేళాలో రష్యాకు చెందిన ఓ బాహుబలి బాబా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆరడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం, అందమైన ముఖవర్చస్సుతో బాహుబలి బాబా మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక బాహుబలి బాబా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి.

హిందూ ధర్మాన్ని స్వీకరించిన రష్యన్
ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పని చేసిన ఈయన ప్రపంచంలో చాలా దేశాల్లో టూరిస్ట్ గా సంచరించారు. ఈ క్రమంలో 30 సంవత్సరాల క్రితం భారతదేశ పర్యటనకు వచ్చిన ఈయన భారతదేశంలో ఉన్న హిందూ ధర్మానికి, ఆధ్యాత్మికతకు కనెక్ట్ అయ్యారు. సనాతన ధర్మంతో ఆయనకు ఏర్పడిన పరిచయం కాస్త హిందూ ధర్మ గొప్పతనాన్ని గ్రహించి దానిని స్వీకరించేలా చేసింది.
ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్ గా బాహుబలి బాబా
ఈ క్రమంలో ఆయన తన పేరును ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్ గా మార్చుకున్నారు. భారతదేశంలోనే కొంత కాలం పాటు ఉండి హిందూ పురాణాలను, ఇతిహాసాలను చదివారు. అనంతరం నేపాల్ వెళ్లి అక్కడ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇక కుంభమేళా, మహా కుంభమేళా జరిగినప్పుడల్లా నేపాల్ నుండి భారత్ కు వచ్చి తిరిగి వెళుతున్నారు ఈ బాహుబలి బాబా.
బాహుబలి బాబా స్పెషల్ అట్రాక్షన్
ప్రయాగ్ రాజ్ కు కుంభమేళా కోసం వచ్చిన ఈ సాధువు ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్ కంటే ఎర్రగా, ఎత్తుగా కండలు తిరిగి ఉండటంతో ఆయనను చూసిన వారు ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పటికే మహా కుంభమేళాలో కంప్యూటర్ బాబా, ఐఐటీ బాబా, చాయ్‌వాలే బాబా, పర్యావరణ్ బాబా, గోల్డెన్ బాబాలు తారసపడగా ఇప్పుడు బాహుబలి బాబా రచ్చ చేస్తున్నారు. ప్రభాస్ కన్నా అందంగా కనిపిస్తున్నాడు.












Click it and Unblock the Notifications