విజయ్ మాల్యాకు ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట

హైదరాబాద్: దేశీయ బ్యాంకుల్లో రూ. 9,000 కోట్లు పైగా రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్‌ మాల్యాకు కాస్త ఊరట లభించింది. ఆయనకు సంబంధించిన ఈ కేసును సోమవారం ముంబై ప్రత్యేక న్యాయస్థానం విచారించింది.

మాల్యాను 'పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు'గా గుర్తించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దరఖాస్తుకు సంబంధించి సమాధానం ఇస్తూ మాల్యాకు మూడు వారాల గడువు ఇచ్చింది. సెప్టెంబర్‌ 24లోపు మాల్యా దీనిపై సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇచ్చిన గడువులోపు మాల్యా స్పందించకపోతే తదుపరి చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టు స్పష్టం చేసింది.

Special court grants Vijay Mallya three weeks to reply to EDs notice,

విజయ్ మాల్యా సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలుంటాయని కోర్టు తెలిపింది.
కాగా, మాల్యా తరఫు న్యాయవాది దీనిపై వాదిస్తూ..మారిషస్‌ అడ్రస్‌కు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు మాల్యాకు అందనేలేదని, ఇప్పుడు కోర్టు ఇచ్చిన గడువు మాల్యాకు సరిపోదన్నారు.

దీనికి ఈడీ తరఫు న్యాయవాది సమాధానం ఇస్తూ.. ఆర్థిక నేరస్థుల నియంత్రణ చట్టం' ప్రకారం ఈడీ దరఖాస్తు చేసుకున్న తర్వాత నిందితులకు ఎటువంటి అదనపు సమయాన్ని కేటాయించకూడదని, ఇలా సమయాన్ని పొడిగించే అధికారం కోర్టుకు కూడా లేదని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+