ఆ ఇద్దరికీ ఆ కోరిక తీరలేదు, శ్రీదేవి కుటుంబంలో విచిత్రం

న్యూఢిల్లీ: బోనికపూర్ ఇద్దరు భార్యలు తమ వారసుల సినీ రంగ ప్రవేశాన్ని చూడలేకపోయారు. తమ వారసులు నటించిన సినిమాలు విడుదల కాకముందే వారు మరణించారు. బోనికపూర్ మొదటి భార్య మోనాకపూర్ , రెండో భార్య శ్రీదేవి కూడ ఇదే తరహలో మరణించడం ఆ కుటుంబాన్ని విషాదంలో నింపింది.

Recommended Video

    Sridevi Passes Away : Janhvi Kapoor In Critical Situation

    అందాల నటి శ్రీదేవి మరణం ఆమె అభిమానులను తీవ్ర విషాదంలో నింపింది. దుబాయ్‌లో ఓ వివాహ ఫంక్షన్‌కు హజరయ్యేందుకు భర్తతో కలిసి వెళ్ళిన శ్రీదేవి శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు.

    శ్రీదేవి బౌతికకాయాన్ని దుబాయ్‌ నుండి ముంబైకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నాడు సాయంత్రానికి శ్రీదేవి భౌతికకాయం హైద్రాబాద్‌కు తరలించే అవకాశం ఉంది.

    వారసులను సినిమాల్లో చూడకుండానే బోని కపూర్ భార్యల మృతి

    వారసులను సినిమాల్లో చూడకుండానే బోని కపూర్ భార్యల మృతి

    బోనికపూర్ మొదటి భార్య మోనా కపూర్, రెండో భార్య శ్రీదేవిలు తమ వారసుల సినీ రంగ ప్రవేశం గురించి చూడకుండానే మరణించారు. ఇద్దరు కూడ తమ వారసుల సినీ రంగ ప్రవేశం గురించి ఎన్నో ఆశలు పెట్టుకొన్నారు. కానీ, ఆ ఆశలు తీరకుండానే కన్నుమూశారు. యాధృచ్చికంగా జరిగినా వీరిద్దరి జీవితాల్లో ఈ రెండు ఘటనల్లో సామీప్యత కన్పిస్తోంది. వీరి మరణం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

    అర్జున్ కపూర్, జాన్విల సినీ రంగ ప్రవేశం

    అర్జున్ కపూర్, జాన్విల సినీ రంగ ప్రవేశం

    బోనికపూర్ మొదటి భార్య మోనాకపూర్ తన కుమారుడు అర్జున్ కపూర్ సినీ రంగ ప్రవేశాన్ని చూడలేదు. అర్జున్ కపూర్ ఇష్క్ జాదే అనే సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయమయ్యారు. ఈ సినిమా విడుదల కావడానికి రెండు మాసాల ముందే అర్జున్ కపూర్ తల్లి మోనాకపూర్ మరణించారు.ఈ సినిమా మే 2012న విడుదల కాగా, మోనా రెండు నెలల ముందు అంటే మార్చి 25న తుదిశ్వాస విడిచారు. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి ప్రస్తుతం ధడక్ అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ కారణంగానే జాన్వి దుబాయ్‌లో జరిగే వివాహనికి హజరుకాలేదు.

    కూతురి నటనను చూడలేకపోయిన శ్రీదేవి

    కూతురి నటనను చూడలేకపోయిన శ్రీదేవి

    కూతురి నటనను శ్రీదేవి చూడలేకపోయింది. జాన్వి ధడక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తై సినిమా విడుదలకు ఇంకా మూడు మాసాలకు పైగా పట్టే అవకాశం ఉంది.అయితే సినిమాలో జాన్వి నటనను చూసేందుకు శ్రీదేవి బతికిలేరు. ఆమె బతికి ఉండి ఉంటే తన కూతురు నటనను చూసేవారు.

    కూతురి సినీ రంగ ప్రవేశం గురించి శ్రీదేవి ఏం చెప్పారంటే

    కూతురి సినీ రంగ ప్రవేశం గురించి శ్రీదేవి ఏం చెప్పారంటే

    శ్రీదేవి కూతురు జాన్వి సినీ రంగ ప్రవేశం గురించి ఆమె చాలా ఎగ్జయిట్ అయ్యారు.గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి ఈ విషయాన్ని ప్రస్తావించారు.తాను ఎంతోకాలంగా ఈ పరిశ్రమలో ఉన్నాను. తన కన్నా ఎక్కువగా నేనే సంసిద్ధమై ఉన్నాను. తను నన్ను చూస్తూ పెరిగింది. సినీ రంగంలోకి రావడమంటే ఏమిటో తనకు తెలుసు. ఏ వృత్తిలోనైనా ఏది అనుకున్నంత సులువు కాదు. తను చాలా కష్టపడాల్సి ఉంటుంది. తనకు సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కోవడానికి తను సంసిద్ధంగా ఉందని నేను అనుకుంటున్నానని శ్రీదేవి తెలిపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+