వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

SSR:హీరో సుశాంత్ సింగ్ కేసు, సీబీఐ చేతికి ఎయిమ్స్ ఫోరెన్సిక్ రిపోర్టు ! ఇక గంగజాతరే, ఏం జరిగిందంటే ?

|
Google Oneindia TeluguNews

ముంబాయి/ న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) అనుమానాస్పద మృతిని మళ్లీ పరిశీలించడానికి, పోస్టుమార్టుం స్యాంపిల్స్ పరిశీలించడానికి వెళ్లిన ఆల్ ఇండియా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఫోరెన్సిక్ నిపుణులు, ప్రత్యేక వైద్యులు క్షుణ్ణంగా మొత్తం పరిశీలించి వివరాలు సేకరించారని సమాచారం. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసుకు సంబంధించి ఎయిమ్స్ అధికారులు సీబీఐ అధికారులను కలిసి తుది నివేదిక సమర్పించడానికి సిద్దం అయ్యారని తెలిసింది. ఎయిమ్స్ నిపుణులు నివేదిక సమర్పించిన తరువాత సీబీఐ అదికారులు సుశాంత్ సింగ్ కేసు వ్యవహారంల తేల్చడానికి సిద్దం అవుతున్నారని వెలుగు చూసింది. ఎయిమ్స్ అధికారులు రిపోర్టు ఇచ్చిన తరువాత సీబీఐ అధికారులు అసలు గంగజాతర మొదలుపెడుతారని సుశాంత్ సింగ్ సన్నిహితులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Kangana: కరోనా కంటే కంగనా డేంజర్, క్వీన్ పక్కలో డాన్ అబుసలేం తమ్ముడా ? నగ్మా ఎంట్రీతో కలకలం !Kangana: కరోనా కంటే కంగనా డేంజర్, క్వీన్ పక్కలో డాన్ అబుసలేం తమ్ముడా ? నగ్మా ఎంట్రీతో కలకలం !

 ముంబాయి పోలీస్ టూ సీబీఐ

ముంబాయి పోలీస్ టూ సీబీఐ

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) ఆత్మహత్య చేసుకున్నాడని ముంబాయి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే హీరో సుశాంత్ సింగ్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని స్వయంగా ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు, ఆయన అభిమానులు ఆరోపించారు. ముంబాయి పోలీసుల నుంచి కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుశాంత్ సింగ్ కేసు సీబీఐకి అప్పగించడం అనేక మందికి మింగుడుపడటం లేదు.

 ఎయిమ్స్ తో సీబీఐ భేటీ

ఎయిమ్స్ తో సీబీఐ భేటీ

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు (అనుమానాస్పద మృతి) విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. సుశాంత్ సింగ్ కేసును ఇంతకు ముందు ముంబాయి పోలీసులు ఏ కోణంలో విచారణ చేశారు ? అంటూ సీబీఐ అధికారులు ఇప్పటికే ఆరా తీశారు. అనంతరం సీబీఐ అధికారులు ఢిల్లీలోని ఎయిమ్స్ నిపుణులతో భేటీ అయ్యారు.

 ఏం జరిగిందో చెప్పండి

ఏం జరిగిందో చెప్పండి

సీబీఐ అధికారులతో చర్చించిన ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులు, వైద్యులు ముంబాయి వెళ్లి సుశాంత్ సింగ్ పోస్టుమార్టం నివేదిక, పోస్టుమార్టుం స్యాంపిల్స్ పరిశీలించారు. ఎయిమ్స్ సీనియర్ వైద్యుడు, ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ సుధీర్ గుప్తా నేతృత్వంలోని ప్రత్యేక బృందం ముంబాయి వెళ్లి viscera పరీక్షలు నిర్వహించింది. అయితే డాక్టర్ సుధీర్ గుప్తా నేతృత్వంలోని ప్రత్యేక బృందం నిర్వహించిన పరీక్షల నివేదికను బహిరంగం చెయ్యకూడదని నిర్ణయించారని తెలిసింది.

 సీబీఐ చేతికి రిపోర్టు వస్తే అంతే కథ

సీబీఐ చేతికి రిపోర్టు వస్తే అంతే కథ

డాక్టర్ సుధీర్ గుప్తా నేతృత్వంలోని ప్రత్యేక బృందం సుశాంత్ సింగ్ డెత్ రిపోర్టు తుది నివేదికను సీబీఐ అధికారులకు అప్పగించడానికి సిద్దం అయ్యారు. ఎయిమ్స్ నిపుణులు తుది నివేదిక ఇచ్చిన తరువాత సీబీఐ అధికారుల అసలు దర్యాప్తు ఉంటుందని, అప్పుడు అసలు బండారం మొత్తం బయటకు వస్తుందని బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సన్నిహితులు అంటున్నారు.

Recommended Video

Sushant Singh Rajput : Sushant,దిశ మరణాల వెనుక టాప్ బిల్డర్.. అసలేం జరిగిందంటే..? || Oneindia Telugu
 ఎన్ సీబీ అధికారులు

ఎన్ సీబీ అధికారులు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముంబాయిలో జూన్ 14వ తేదీ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డ్రగ్స్ ఉపయోగించేవాడని ఆరోపణలు రావడంతో ఎన్ సీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో శ్యాముయల్ మిరండ, దిలీప్ సావంత్, డ్రగ్ డీలర్ అబ్దుల్ బాస్టిట్ పరిహార్ అనే ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేశారు. ఈ ముగ్గురు బెయిల్ మంజూరు చెయ్యాలని ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 29వ తేదీన ఈ కేసు విచారణ జరగనుంది. ఇదే సమయంలో ఎయిమ్స్ నిపుణులు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు విషయంలో తుదినివేదికను సీబీఐ అధికారులను అప్పగించడానికి సిద్దం అయ్యారు.

English summary
SSR Case: The forensic team of the All India Institute of Medical Sciences (AIIMS), which went to Mumbai to re-examine the circumstances leading to Bollywood actor Sushant Singh Rajput’s death, is likely to meet the CBI Special Investigation Team (SIT) and submit its report on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X