స్టాలిన్ సహా ఎమ్మెల్యేలు అరెస్ట్, ఉద్రిక్తత: స్పీకర్ కార్యాలయంపై దాడి

అసెంబ్లీ చోటు చేసుకున్న పరిణామాలకు నిరసనగా మెరీనా బీచ్‌లోని గాంధీ విగ్రహం వద్ద డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ శనివారం సాయంత్రం నిరాహార దీక్షకు దిగారు.

చెన్నై: అసెంబ్లీ చోటు చేసుకున్న పరిణామాలకు నిరసనగా మెరీనా బీచ్‌లోని గాంధీ విగ్రహం వద్ద డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ శనివారం సాయంత్రం నిరాహార దీక్షకు దిగారు. స్టాలిన్ దీక్ష విషయం తెలిసి డీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు, కార్యర్తలు భారీగా తరలివస్తున్నారు.

stalin and dmk mlas keeping hunger strike at marina

స్టాలిన్ తోపాటు డీఎంకే ఎమ్మెల్యేలను మార్షల్స్ సహాయంతో అసెంబ్లీ నుంచి బయటికి తరలించిన అనంతరం స్పీకర్.. సీఎం పళనిస్వామికి బలనిరూపణ పరీక్ష నిర్వహించారు. అనంతరం పళనిస్వామి పరీక్షలో నెగ్గినట్లు ప్రకటించారు.

stalin and dmk mlas keeping hunger strike at marina

కాగా, అసెంబ్లీ నుంచి స్టాలిన్ సహా డీఎంకే ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా బయటికి తరలించారు. మార్షల్స్.. స్టాలిన్ ఎత్తుకుని బలవంతంగా బయటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో స్టాలిన్ చొక్కా చిరిగిపోయింది. దీంతో చిరిగిన చొక్కాతోనే ఆయన బయటికి వచ్చారు.

అరెస్ట్, ఉద్రిక్తత

ఆ తర్వాత నేరుగా రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలను స్టాలిన్.. గవర్నర్‌కు వివరించారు. అనంతరం నేరుగా మెరీనా బీచ్‌కు వెళ్లి అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు నిరసనగా నిరాహార దీక్ష దీక్ష చేపట్టారు.

కాగా, భారీగా మోహరించిన పోలీసులు.. దీక్ష చేస్తున్న స్టాలిన్ సహా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. భారీగా చేరిన నేతలు, కార్యకర్తలు స్టాలిన్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆందోళకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాగా, 144 సెక్షన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

stalin and dmk mlas keeping hunger strike at marina

స్పీకర్ కార్యాలయంపై దాడి

అసెంబ్లీలో స్పీకర్ వ్యవహరించిన తీరుకు నిరసనగా డీఎంకే కార్యకర్తలు స్పీకర్ ధన్ పాల్ కార్యాలయంపై దాడులకు పాల్పడ్డారు. రాళ్లదాడి చేసి అద్దాలను పగలగొట్టారు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పెట్రోల్ బాంబులతో దాడులకు యత్నించారు. పోలీసులు రంగం ప్రవేశం చేసి ఆందోళనకారులను అక్కడ్నుంచి తరిమేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+