వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా బాధితులకు అండగా.. సీఎం స్టాలిన్ ను కలిసి స్టార్ హీరో విజయ్ సేతుపతి భారీ సాయం

|
Google Oneindia TeluguNews

ప్రజలకు కరోనా నుండి కాపాడుకోవటానికి కరోనా నిబంధనలు పాటించాలని చెప్పటమే కాదు అవసరం అయితే ఆపన్న హస్తం అందించటానికి ముందు వరుసలో ఉంటున్నారు చాలామంది సినీ సెలబ్రిటీలు. భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాలు విలవిలలాడాయి. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో కరోనా కారణంగా తీవ్రమైన నష్టం వాటిల్లింది.

షాకింగ్ విషయం చెప్పిన వైద్య ఆరోగ్య శాఖ .. సీజన్ తో సంబంధం లేకుండా కరోనా సోకే అవకాశం !!షాకింగ్ విషయం చెప్పిన వైద్య ఆరోగ్య శాఖ .. సీజన్ తో సంబంధం లేకుండా కరోనా సోకే అవకాశం !!

ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న స్టార్ సెలబ్రెటీలు కరోనా మహమ్మారి భారీ నుండి దేశాన్ని కాపాడడం కోసం తమ వంతు సహాయాన్ని అందిస్తూ ముందుకు వస్తున్నారు. ఇదే క్రమంలో తమిళనాడులో 'మక్కల్ సెల్వన్' అనే బిరుదుతో పేరు తెచ్చుకున్న కోలీవుడ్-టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కరోనా మహమ్మారి బారిన పడి ఇబ్బందులు పడుతున్న బాధితుల ఆదుకోవడం కోసం ఒక అడుగు ముందుకు వేశారు. ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఆయన సచివాలయంలో కలుసుకుని కోవిడ్ 19 రిలీఫ్ కోసం 25 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు.

https://telugu.oneindia.com/news/telangana/telangana-medical-health-department-said-the-shocking-news-about-coronavirus-295532.html

కరోనా బాధితుల కోసం విరాళం ఇవ్వడానికి సిఎంతో సమావేశమైన తమిళ నటుల జాబితాలో చేరిన తాజా వ్యక్తి విజయ్ సేతుపతి. సూపర్ స్టార్ రజనీకాంత్, సూర్య, కార్తీ, అజిత్, శివ కార్తికేయన్, ఐశ్వర్య రాజేష్ తదితరులు ఇప్పటికే విరాళాలు ఇచ్చారు. తాజాగా విజయ్ సేతుపతి కూడా కరోనా మహమ్మారి పై పోరాటంలో తాను సైతం అంటూ ముందుకు వచ్చారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి తమిళంలోనే కాకుండా తెలుగులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

English summary
Kollywood-Tollywood actor Vijay Sethupathi, who is known by the title 'Makkal Selvan' in Tamil Nadu, today called on the Tamil Nadu Chief Minister MK Stalin and donated a sum of rupees twenty-five lakhs towards the COVID 19 relief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X